Rajinikanth: సీఎం రిలీఫ్ ఫండ్‌కు రజినీకాంత్ భారీ విరాళం

Rajinikanth: సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్ ను ఈ రోజు క‌లిశారు.

Arun Chilukuri
Published on: 17 May 2021 2:24 PM IST
Rajinikanth Donates Rs 50 Lakh to CM Relief Fund
X

Rajinikanth: సీఎం రిలీఫ్ ఫండ్‌కు రజినీకాంత్ భారీ విరాళం

Rajinikanth: సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్ ను ఈ రోజు క‌లిశారు. త‌మిళ‌నాడులో కరోనా కేసులు విప‌రీతంగా పెరిగిపోతోన్న నేప‌థ్యంలో సీఎం స‌హాయ నిధికి ర‌జ‌నీకాంత్ రూ.50 లక్షల సాయం అందించారు. కాగా, ర‌జ‌నీకాంత్ 35 రోజుల పాటు హైద‌రాబాద్‌లో అన్నాత్తె షూటింగ్ చేయ‌గా, రీసెంట్‌గా ప్ర‌త్యేక ఫ్లైట్‌లో హైద‌రాబాద్ నుండి చెన్నైకు వెళ్లారు. ఈ రోజు వీలు చూసుకొని సీఎంను క‌లిసి విరాళం అందించారు.

ఇప్పటికే హీరో సూర్య, కార్తీ, వారి తండ్రి, సీనియర్‌ నటుడు శివ కుమార్లు కలిసి సీఎం స్టాలిన్‌కు కోటి రూపాయల చెక్‌ విరాళంగా అందించిన సంగతి తెలిసిందే. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ రెండవ కూతురు సౌందర్య రజనీకాంత్‌ సైతం విరాళం ఇచ్చింది. ఆమె భర్త విశాగన్‌ వనంగముడి, మామ ఎస్‌ఎస్‌ వనంగముడితో కలిసి శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు కోటి రూపాయల చెక్‌ను అందించింది. అంతేగాక హీరో అజిత్‌ సైతం రూ. 25 లక్షలు విరాళం ఇవ్వగా.. ప్రముఖ దర్శకుడు మురుగదాస్‌, హీరో ఉదయనిధి స్టాలిన్‌లు చేరో 25 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story