రజనీకాంత్ కోసం ఆసక్తికరమైన టైటిల్ ను ఎంపిక చేసిన నెల్సన్ దిలీప్ కుమార్

Rajinikanth And Nelson Dilipkumar Movie Title | Kollywood News
x

రజనీకాంత్ కోసం ఆసక్తికరమైన టైటిల్ ను ఎంపిక చేసిన నెల్సన్ దిలీప్ కుమార్

Highlights

రజనీకాంత్ కోసం ఆసక్తికరమైన టైటిల్ ను ఎంపిక చేసిన నెల్సన్ దిలీప్ కుమార్

Rajinikanth Next Movie Title: కోలీవుడ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్ ల లో దిలీప్ కుమార్ పేరు ముందే ఉంటుంది. వరుసగా బ్లాక్బస్టర్ సినిమాలతో ముందుకు దూసుకుపోతున్న నెల్సన్ తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం "బాస్" అనే టైటిల్ ను అనుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి నెల్సన్ దిలీప్ కుమార్ తన సినిమాల టైటిల్స్ విభిన్నంగా ఉండేలా ప్లాన్ చేస్తారు.

అందుకే రజినీకాంత్ కి కూడా తన ఇమేజ్ కి సెట్ అయ్యే లాగా "బాస్" అనే టైటిల్ ను అనుకుంటున్నారట.మరోవైపు గత కొంతకాలంగా రజినీకాంత్ వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో రజనీకాంత్ మంచి హిట్ అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తయింది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెట్స్ పైకి వెళ్లనుంది.

ఇక ఈ మధ్య కాలంలో ప్యాన్ ఇండియన్ సినిమాలకి మంచి క్రేజ్ దక్కుతోంది. ఈ నేపథ్యంలోనే రజనీకాంత్ కి ఉన్న పాన్ ఇండియన్ ఇమేజ్ ని కూడా దృష్టిలో పెట్టుకొని స్క్రిప్టుపై వర్క్ చేస్తున్నారు నెల్సన్ దిలీప్ కుమార్. ఈ సినిమాతో ఒక పక్కా కమర్షియల్ సక్సెస్ అందుకుంటామని చిత్ర బృందం కాన్ఫిడెంట్ గా ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా వచ్చే ఏడాది ఆరంభంలో విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories