Rajini Darbar : ట్రైలర్ తోనే ఇరగదీసేస్తున్నాడుగా!

Rajini Darbar : ట్రైలర్ తోనే ఇరగదీసేస్తున్నాడుగా!
x
Highlights

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీ స్టైలేవేరు. అందులోనూ పోలీసోడిగా చేయాలంటే రజనీ తర్వాతే. పాతికేళ్ళయింది రజనీని అలా చూసి.. ఇప్పుడు దర్బార్ ఆ లోటును తీర్చింది..

రజనీకాంత్.. నడిచినా.. నిలబడినా..సిగరెట్ వెలిగించినా అభిమానులకు పండగే. కాలం పెద్దధైపోతోంది.. కానీ, రజనీ స్టైల్ లో మార్పు లేదు. రజనీకి ఇప్పటికీ వయసు పెద్ద కాలేదు. కాలానికే వయసొచ్చింది అంటున్నారు అభిమానులు. చాలా కాలంగా డాన్ తరహా పాత్రలతో సినిమాలు లాగిస్తున్న రజనీ ఒక్కసారిగా రూటు మార్చారు. పోలీస్ ఆఫీసర్ గా ప్రత్యక్షం అయ్యారు. అంతే..అభిమానుల ఆనందానికి అంతులేకుండా పోయింది.

తాజాగా రజనీకాంత్ దర్బార్ సినినిమాలో చేస్తున్నారు. ఈ సూపర్ స్టార్ పక్కన లేడీ సూపర్ స్టార్ నయనతారహీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలైంది. దాదాపు పాతికేళ్ళ తరువాత పోలీసు డ్రస్సు వేశారు రజనీకాంత్. ఇక ఆ డ్రస్సులో అయన చేసిన విన్యాసాలకు ఇప్పుడు సోషల్ మీడియా ఊగిపోతోంది.

'సార్ వాల్లకొకటి చెప్పండి..పోలీసుల దగ్గరకి లెఫ్ట్ లో రావచ్చు..రైట్లో రావచ్చు..స్ట్రైట్ గా మాత్రం రావద్దని'' - 'ఆ చూపేంటి ఒరిజినల్ గానే విలన్నమ్మా''

ఇవీ రజనీ మార్క్ డైలాగులు. ఈ డైలాగులకు అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఇక ట్రైలర్ ఫినిషింగ్ టచ్ గా పోలీస్ డ్రస్ లో నడుచుకుని వస్తూ ''ఐ యామె బ్యాడ్ కాప్'' అంటూ చెప్పిన డైలాగ్ చివరి పంచ్ లెక్కలో పేలింది.

రజనీ మేనియా మొదటి ట్రైలర్ తోనే మొదలైపోయింది. ఈ ట్రైలర్ ప్రభంజనం చూస్తుంటే, రజనీ అభిమానుల పవర్ తెలుస్తోంది. ఒక్క ట్రైలర్ తోనే రికార్డుల పరుగు మొదలైపోయింది రజనీ దర్బార్ కి. ప్రతి గంటకీ ట్రైలర్ వ్యూస్ ఉప్పెనలా ఉరికి పడుతున్నాయి. రిలీజ్ అయిన 12 గంటల్లో దాదాపు 12.4 మిలియన్ల (కోటీ 24 లక్షల) వ్యూస్‌ సాధించింది. దర్బార్‌ ట్రైలర్‌ (తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి). అంటే ప్రతీ గంటకు పది లక్షలకు పైగా వ్యూస్‌ సాధిస్తోంది. లైక్‌లు, కామెంట్‌లు కూడా అదే స్థాయిలో వస్తున్నాయి.

రజనీ స్టామినాకి నిదర్శనంగా నిలుస్తున్నాయి ఈ రికార్డ్ వ్యూస్‌ సాధిస్తూ ట్రైలర్‌ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

దీంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. కాగా, ట్రైలర్ తో సినిమా మీద అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories