Rajeev Kanakala - Suma: నాకు సుమకి మధ్య వచ్చిన వార్తల్లో నిజం లేదు

Sandeep Reddy
Updated on: 28 July 2021 2:55 PM IST
Rajeev Kanakala Responded to the rumours about his wife Anchor Suma
X

సుమ రాజీవ్ కనకాల (ఫోటో: ది హన్స్ ఇండియా)

Rajeev Kanakala - Suma: బుల్లితెర ప్రముఖ ఛానెల్స్ లోని పలు గేమ్ షోలలో యాంకర్ గా నిత్యం తెలుగు ప్రేక్షకుల ముందుండే సుమ సగటు తెలుగు ప్రేక్షకుడికి సుపరిచితమే. నటుడు రాజీవ్ కనకాలతో పెళ్లికి ముందు కొన్ని తెలుగు, మలయాళ చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన సుమ ఆ తర్వాత తెలుగు టెలివిజన్ రంగంలో యాంకర్ గా నెమ్మదిగా నిలదొక్కుకొని ప్రస్తుతం స్టార్ యాంకర్ గా మారి పలువురు అప్ కమింగ్ యాంకర్ లకు రోల్ మోడల్ గా నిలిచింది. అటు టెలివిజన్ షోలతో పాటు పెద్ద సినిమాల ఆడియో ఫంక్షన్ లతో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేస్తూ మూడు పువ్వులు ఆరు కాయలుగా సంపాదిస్తున్న సుమ తన భర్త రాజీవ్ కనకాల మీద గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న అవాస్తవాలను తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో రాజీవ్ కనకాల ఖండించాడు.

సుమకి తనకి మధ్య ఎలాంటి గొడవలు లేవని, ప్రస్తుతం సుమ వరుస షోలతో తన కంటే బాగానే సంపాదిస్తుంది కాని ఎప్పుడు తమ మధ్య ఆర్థికపరమైన విషయాలపై అభిప్రాయ భేదాలు రాలేదని చెప్పుకొచ్చాడు. కొంతకాలం క్రితం సుమకి పిల్లలకి నేను దూరంగా వేరుగా ఉన్న మాట వాస్తవేమే కాని అది తమ మధ్య వచ్చిన గొడవల వల్ల కాదని, తన తల్లి చనిపోయిన తర్వాత ఒంటరిగా ఉన్న తన తండ్రి ఆరోగ్యం సరిగ్గా లేనందువలనే కొద్దిరోజులు కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్నట్లు క్లారిటీ ఇచ్చాడు. భార్యభర్తల మధ్య ఉండే చిన్న చిన్న మనస్పార్ధాలు తప్ప తమ మధ్య బయట జనాలు మాట్లాడుకునేంత పెద్ద గొడవలు జరగలేవని మా కుటుంబం అంత సంతోషంగా ఉన్నామని బయట వస్తున్న వార్తలు అవాస్తవాలు అని కొట్టిపారేశారు రాజీవ్ కనకాల.

ఇక ఇటీవల వెంకటేష్ హీరోగా నటించిన "నారప్ప" చిత్రంలో కీలక పాత్రలో నటించిన రాజీవ్ కనకాల చాలా రోజుల తర్వాత తన నటనతో మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు

Sandeep Reddy

Sandeep Reddy

Next Story