Rajeev Kanakala: సినీ నటుడు రాజీవ్ కనకాలకు పోలీసులు నోటీసులు జారీ..అసలేం జరిగింది?

Rajeev Kanakala
x

Rajeev Kanakala: సినీ నటుడు రాజీవ్ కనకాలకు పోలీసులు నోటీసులు జారీ..అసలేం జరిగింది?

Highlights

Rajeev Kanakala: సినీనటుడు రాజీవ్ కనకాలకు రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ పసుమాముల రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 421లోని వెంచర్లో తనకు సంబంధించిన వివాదాస్పద ఫ్లాట్లను సినీ ఇండస్ట్రీ చెందిన విజయ్ చౌదరికి గతంలో రాజీవ్ కనకాల విక్రయించారు.

Rajeev Kanakala: సినీనటుడు రాజీవ్ కనకాలకు రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ పసుమాముల రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 421లోని వెంచర్లో తనకు సంబంధించిన వివాదాస్పద ఫ్లాట్లను సినీ ఇండస్ట్రీ చెందిన విజయ్ చౌదరికి గతంలో రాజీవ్ కనకాల విక్రయించారు. అయితే ఆ తర్వాత ఆ ఫ్లాటును విజయ్ చౌదరి మరో వ్యక్తికి రూ. 70 లక్షలకు అమ్మారు. అయితే ఇక్కడ అసలు లేని ఫ్లాట్‌ను ఇంతమంతి ఎలా అమ్మగలరంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి.. దీనికి సంబంధించి రాజీవ్ కనకాలకు నోటీసులు జారీ చేశారు.


పసుమాముల రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 421 లోని వెంచర్లో ఒక ఫ్లాటును రాజీవ్ కనకాల విజయ్ చౌదరికి అమ్మాడు. అయితే అక్కడ లేని ప్లాటును ఉన్నట్టు చూపించి మోసం చేశారన్నది బాధితుల ఆరోపణలు. దీంతో సినీ నిర్మాత విజయ్ చౌదరిపై హయత్ నగర్‌‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. అదేవిధంగా ఇదే కేసులో విచారణకు రావాలని రాజీవ్ కనకాలకు నోటీసులు జారీ చేశారు. అయితే తనకు ఆరోగ్యం బాగాలేదని, విచారణకు తర్వాత వస్తానని రాజీవ్ కనకాల పోలీసులకు చెప్పినట్లు సమాచారం. కానీ ఈ రోజు కాకపోయినా, రేపయినా రాజీవ్ కనకాల విచారణకు హాజరు కావాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories