Shekar Movie First Look: 'శేఖర్' గా రాజశేఖర్

పోలీస్ క్యారెక్టర్ చేయాలంటే రాజశేఖర్ మాత్రమే చేయగలరు అనేంతగా పేరు సంపాదించారు.

K V D Varma
Published on: 4 Feb 2021 2:02 PM IST
Shekar Movie First Look: శేఖర్ గా రాజశేఖర్
X

'శేఖర్' ' సినిమా పోస్టర్  

తలంబ్రాలు తో తెలుగు సినిమాలో పాదం మోపిన రాజశేఖర్.. అంకుశం.. ఆగ్రహం.. వంటి సినిమాలతో యాంగ్రీ యంగ్ మ్యాన్ లాంటి క్యారెక్టర్లకు కేర్ ఆఫ్ ఎడ్రస్ గా మారిపోయారు. ముఖ్యంగా పోలీస్ క్యారెక్టర్ చేయాలంటే రాజశేఖర్ మాత్రమే చేయగలరు అనేంతగా పేరు సంపాదించారు. వరుస విజయాలతో రాజశేఖర్ తెలుగు సినిమా పరిశ్రమలో మంచి నటుడిగా ప్రేక్షకులకు బాగా చేరువ అయ్యారు. రాజశేఖర్ పుట్టినరోజు ఈరోజు. అయన తన 59వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.

ఈ సందర్భంగా అయన తాజా చిత్రం టైటిల్ ను ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఇది ఆయనకు 91వ సినిమా. ఈ సినిమాకు 'శేఖర్' అనే పేరు పెట్టారు. శేఖర్ సినిమా షూటింగ్ కూడా ఈరోజు ప్రారంభించినట్టు ట్విట్టర్ లో పేర్కొన్నారు. దీంతో పాటు ఈ సినిమా మోషన్ పోస్టర్ కూడా విడుదల చేశారు. రాజశేఖర్ ఈ వయసులోనూ యాంగ్రీ యాంగ్ మాన్ లా ఈ పోస్టర్ లో కనిపిస్తున్నారు. తనదైన చూపులతో రాజశేఖర్ లుక్ చూస్తుంటే అంకుశం సినిమా నాటి రాజశేఖర్ గుర్తు వస్తున్నారు.

కాగా, ఇటీవల రాజశేఖర్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయన ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఈ సందర్భంగా అయన అభిమానులు.. సినీ ప్రేమికులు అయన కరోనా బారి నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు చేశారు. తాను కరోనా నుంచి కోలుకోవడానికి అభిమానుల ప్రార్థనలు, ప్రేమే కారణమంటూ రాజశేఖర్‌ తన పుట్టినరోజు సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో నిర్మితమవుతున్న శేఖర్ సినిమాకు లలిత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అనూప్‌‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు. రాజశేఖర్ అయన మిత్రులు కల్సి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


K V D Varma

K V D Varma

Next Story