చిరంజీవి స్థానంలో అదృష్టం పరీక్షించుకోబోతున్న రాజశేఖర్

చిరంజీవి స్థానాన్ని తీసుకున్న రాజశేఖర్

admin1
Published on: 12 Jan 2022 3:17 PM IST
Rajasekhars Shekar Movie Release 14 01 2022 |Tollywood News Today
X

చిరంజీవి స్థానంలో అదృష్టం పరీక్షించుకోబోతున్న రాజశేఖర్

Shekar Movie: మళ్లీ పెరుగుతున్న కరోనా కేసుల వల్ల బాక్సాఫీస్ వద్ద కళకళలాడాల్సిన టాలీవుడ్ ఇప్పుడు వెలవెలబోతోంది. "ఆర్ ఆర్ ఆర్", "రాధే శ్యామ్" వంటి సినిమాలు సంక్రాంతి బరిలో నుండి తప్పుకోగా "బంగార్రాజు", "రౌడీ బాయ్స్" వంటి చిన్న మరియు మీడియం బడ్జెట్ సినిమాలు సంక్రాంతి రేసులో పాల్గొంటున్నాయి. మరోవైపు ఫిబ్రవరి లో విడుదల కావాల్సిన మెగాస్టార్ చిరంజీవి "ఆచార్య" సినిమా కూడా ఇప్పుడు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ సినిమా ప్లేస్ ఇప్పుడు సీనియర్ హీరో రాజశేఖర్ కి దొరికింది. ఈ మధ్యనే "కల్కి" సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రాజశేఖర్ ఇప్పుడు "శేఖర్" అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

2018 లో విడుదలైన సూపర్ హిట్ సినిమా జోసఫ్ కి తెలుగు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. రాజశేఖర్ కూడా ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాను కి జీవిత రాజశేఖర్ స్వయంగా దర్శకత్వం వహించారు. నిజానికి ఫిబ్రవరి 4న భారీ ఎత్తున విడుదల కావాల్సిన "ఆచార్య" సినిమా తప్పుకోగా, ఆ స్థానంలో అదేరోజున "శేఖర్" సినిమాని విడుదల చేయడానికి నిర్ణయించుకున్నారు దర్శకనిర్మాతలు. ఇక ఈ సినిమా పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమాతో రాజశేఖర్ కు ఎంత వరకు హిట్ అవుతుందో వేచి చూడాల్సిందే.

admin1

admin1

Next Story