Rajasekhar: మాఫియా డాన్ పాత్రలో రాజశేఖర్

Rajasekhar Plays the Role of Mafia Don in Shekhar Movie
x

Rajasekhar: మాఫియా డాన్ పాత్రలో రాజశేఖర్

Highlights

Rajasekhar: మాఫియా డాన్ పాత్రలో రాజశేఖర్

Rajasekhar: "కల్కి" సినిమా తరువాత మళ్లీ వెండి తెరకు కి దూరంగా ఉన్న సీనియర్ హీరో రాజశేఖర్ త్వరలోనే "శేఖర్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జీవిత రాజశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 20వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు రాజశేఖర్.

ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ ఇంటికి వెళ్లి తమ సినిమాని ప్రమోట్ చేసి వచ్చారు ఈ దంపతులు. ఇక ఈ సినిమా తరువాత రాజశేఖర్ పవన్ సాధినేని అనే డైరెక్టర్ తో చేతులు కలుపనున్నారు. ఇంతకుముందు "ప్రేమ ఇష్క్ కాదల్" అనే సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు పవన్ సాదినేని ఆ తరువాత "సావిత్రి" అనే సినిమాకి దర్శకత్వం వహించారు. కానీ ఆ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది.

ఆ తరువాత చాలా కాలం పాటు ఇండస్ట్రీ మొత్తం తిరిగిన పవన్ సాదినేని ఎట్టకేలకు ఒక స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ తో రాజశేఖర్ ను మెప్పించారు. ఈ సినిమాలో రాజశేఖర్ ఒక మాఫియా డాన్ పాత్రలో కనిపించబోతున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫైనల్ నేరేషన్ కూడా పూర్తయిందట. ఈ సినిమాకి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories