సంక్రాంతి బరిలో దిగనున్న రాజశేఖర్ సినిమా

సంక్రాంతి బరిలో దిగనున్న రాజశేఖర్ సినిమా
"ఆర్ఆర్ఆర్" తప్పుకోగా సంక్రాంతి బరిలో దిగడానికి సిద్దమవుతున్న రాజశేఖర్ సినిమా
Shekar Movie: సీనియర్ హీరో రాజశేఖర్ త్వరలో "శేఖర్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన "జోసఫ్" అనే సినిమాకి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. కొత్త డైరెక్టర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు కానీ మధ్యలో జీవిత రాజశేఖర్ సినిమా దర్శకత్వ బాధ్యతలను స్వీకరించారు. కొన్ని సంస్థలు ఈ సినిమా కోసం పెద్ద అమౌంట్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. డైరెక్ట్ రిలీజ్ కోసం ఒక డిజిటల్ ప్లాట్ ఫాం వారు చిత్ర నిర్మాతలకు 25 కోట్ల వరకు చెల్లించడానికి సిద్ధమయ్యారు. మరి ఈ సమయంలో సినిమాను థియేటర్లలో విడుదల చేస్తారా లేక డిజిటల్ రిలీజ్ ఇస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మొదట ఈ సినిమాని సంక్రాంతి బరిలో దింపాలని అనుకున్నారు.
కానీ "ఆర్ ఆర్ ఆర్" వంటి సినిమాలు అప్పటికే తమ సినిమాలను విడుదల చేస్తున్నట్టు ప్రకటించడం తో ఈ చిత్రాన్ని వాయిదా వేశారు దర్శకనిర్మాతలు. అయితే భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న "ఆర్ ఆర్ ఆర్" సినిమా సంక్రాంతి బరిలో నుండి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో "శేఖర్" సినిమాని సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాని జనవరి మధ్యలో విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్‌కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్‌లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMT
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTBalakrishna: ఒక్క ఛాన్స్ అంటే ఒక్క తప్పిదం చేశారు.. అనుభవిస్తున్నారు
28 May 2022 6:55 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTపంజాగుట్ట పీఎస్‌లో రాంగోపాల్‌వర్మ ఫిర్యాదు
28 May 2022 6:39 AM GMTMinister Roja: ఎన్టీఆర్ పేరు వింటేనే చంద్రబాబుకు వెన్నులో వణుకు...
28 May 2022 6:23 AM GMT