logo
సినిమా

Sukumar: రాజశేఖర్‌ స్ఫూర్తితోనే నేను ఇండస్ట్రీలోకి వచ్చా..

Rajasekhar Movies Inspired me to get Into Films Says Sukumar
X

Sukumar: రాజశేఖర్‌ స్ఫూర్తితోనే నేను ఇండస్ట్రీలోకి వచ్చా..

Highlights

Sukumar: సీనియర్ హీరో రాజశేఖర్ త్వరలో "శేఖర్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Sukumar: సీనియర్ హీరో రాజశేఖర్ త్వరలో "శేఖర్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 20న థియేటర్లలో విడుదల కాబోతోంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు దర్శక నిర్మాతలు. ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇక ఈ వేడుకల్లో మాట్లాడుతూ సుకుమార్ అసలు రాజశేఖర్ సినిమాలు చూసిన తర్వాతే తనకి ఇండస్ట్రీలోకి రావాలన్నా ఆశ కలిగిందని చెప్పారు సుక్కు.

"తలంబ్రాలు, అంకుశం, ఆహుతి మరియు ఆగ్రహం సినిమాలు చూసి నేను కూడా ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని అనుకున్నాను. రాజశేఖర్ గారి సినిమాలు చూసిన తర్వాతే నేను సినిమా తీయగలను కాన్ఫిడెన్స్ వచ్చింది" అని అన్నారు సుక్కు. చాలామంది తమ పిల్లలను ఇండస్ట్రీకి దూరంగా ఉంచాలనుకుంటారు. కానీ, తన ఇద్దరి కూతుర్లను నటీమణులుగా మార్చినందుకు ఆయనకు నమస్కరించాల్సిందే అని సుకుమార్‌ అన్నారు. మలయాళంలో సూపర్ హిట్టయిన జోసఫ్ అనే సినిమా కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆత్మీయ, అభినవ్ గోమటం, రవి వర్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Web TitleRajasekhar Movies Inspired me to get Into Films Says Sukumar
Next Story