రాజశేఖర్ అరోగ్యం మెరుగుపడింది : జీవిత

Arun Chilukuri
Published on: 4 Nov 2020 10:43 AM IST
రాజశేఖర్ అరోగ్యం మెరుగుపడింది : జీవిత
X

కరోనా బారిన పడి ఐసీయూలో చికిత్స పొందుతున్న నటుడు రాజశేఖర్ అరోగ్యం మెరుగుపడిందని ఆయన సతీమణి జీవిత తెలిపారు. సీఎన్‌సీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, త్వరలో ఐసీయూ నుంచి బయటకు వస్తారని చెప్పారు. ఆయన వెంటిలేటర్ పై ఉన్నట్లు వస్తున్న ప్రచారం నిజం కాదని క్రిటికల్ పరిస్థితికి వెళ్లిన విషయం వాస్తమే అన్నారు. ఆక్సిజన్ సోపర్ట్ తగ్గిస్తూ చికిత్స కొనసాగుతుందన్నారు. సీఎన్‌సీ ఆసుపత్రి వైద్యులు నిత్యం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. త్వరలోనే ఐసీయూ నుంచి బయటకొచ్చే అవకాశాలున్నాయని వెల్లడించారు. అభిమానులు ఎంతో మంది మనస్పూర్తిగా చేస్తున్న ప్రార్థనలతో కోలుకున్నారని చెప్పారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story