హీరో రాజశేఖర్‌ హెల్త్‌ బులెటిన్‌ విడుదల

Arun Chilukuri
Published on: 22 Oct 2020 1:41 PM IST
హీరో రాజశేఖర్‌ హెల్త్‌ బులెటిన్‌ విడుదల
X

కొవిడ్‌ బారిన పడ్డ హీరో రాజశేఖర్‌కు సంబంధించి సిటీ న్యూరో సెంటర్‌ ఆసుపత్రి హెల్త్‌ బులెటిన్ రిలీజ్‌ చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ట్రీట్‌మెంట్‌కు స్పందిస్తున్నారని వెల్లడించారు. రాజశేఖర్‌ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారని, వెంటిలేటర్ సపోర్టు లేకుండానే చికిత్సకు స్పందిస్తున్నారని ఆసుపత్రి మెడికల్‌ డైరెక్టర్ రత్నకిశోర్‌ తెలిపారు. ఆసుపత్రి నుంచి ప్రకటన వెలువడకముందు ఆయన చిన్న కుమార్తె శివాత్మిక సామాజిక మాధ్యమాల్లో తన తండ్రి ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ ప్రకటన చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story