Rajinikanth: రజనీ కాంత్ కు 'దాదాసాహెబ్ ఫాల్కే' అవార్డు

Rajanikant Gets Dadasaheb Falke Award
x

రజనీకాంత్:(ఫైల్ ఇమేజ్)

Highlights

Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ కు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది.

Rajinikanth: దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావదేకర్, తన ట్విట్టర్ ఖాతాలో స్వయంగా ప్రకటించారు. "ఈ విషయాన్ని తెలియజేసేందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. భారత సినీ రంగంలోని అత్యున్నత నటుల్లో ఒకరైన రజనీకాంత్ గారికి ఈ సంవత్సరం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందించనున్నాం. ఓ నటుడిగా, నిర్మాతగా స్క్రీన్ రైటర్ గా చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలు నిరుపమానం. రజనీకాంత్ ను ఈ అవార్డుకు ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులకు నా ధన్యవాదాలు" అని ప్రకాశ్ జావదేకర్ వెల్లడించారు. రజనీకి అవార్డు దక్కడంపై పలువురు శుభాభినందనలు తెలుపుతున్నారు.

మొట్టమొదటి సారిగా 1969 లో ప్రకటించిన ఈ పురస్కారాన్ని నటీమణి దేవికా రాణికి అందచేశారు. ఆ తర్వాత కాలంలో పృధ్వీ రాజ్ కపూర్, రూబీ మేయర్స్, బి.యన్ సర్కార్ లాంటి వాళ్ళకు ఈ అవార్డ్ అందచేశారు. కానీ మొట్టమొదటగా ఈ అవార్డు అందుకొన్న తెలుగు వారు మాత్రం బియన్ రెడ్డిగా పిలవబడే బొమ్మిరెడ్డి నరసింహా రెడ్డి. తెలుగు వారే కాదు భారతదేశం గర్వించదగ్గ సినిమాలైన "మల్లీశ్వరి", "బంగారు పాప" లాంటి అత్యుత్తమ సినిమాలు రూపొందించిన బి.యన్.రెడ్డి సోదరుడైన మరో బియన్ రెడ్డి కూడా ఈ పురస్కారాన్ని పొందడం విశేషం. నిజానికి బియన్ కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ కి ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్టుంది. ఇద్దరు తెలుగు బియన్ లు ఈ అవార్డ్ అందుకోగా మరో బియన్ అయిన బి యన్ సర్కార్, బియన్ అనదగిన నితిన్ బోస్ కూడా ఈ పురస్కారం అందుకొన్నారు. బియన్ రెడ్డి లతో పాటు ఈ అవార్డు అందుకొన్న తెలుగు వారిలో పైడి జైరాజ్, ఎల్వీ ప్రసాద్, అక్కినేని నాగేశ్వరరావు, డి.రామానాయుడు, కె. విశ్వనాథ్ ఉన్నారు. దర్శకులు సత్యజిత్ రే, అదూర్ గోపాల కృష్ణన్, మృణాళ్ సేన్, శ్యాం బెనగల్, తపన్ సిన్హా, శాంతారాం, హృషికేష్ ముఖర్జీలు ఈ పురస్కారం అందుకొన్నారు. కేవలం దర్శకులే కాకుండా శివాజీ గణేశన్, దిలీప్ కుమార్, రాజ్ కుమార్ లాంటి నటులు కూడా ఈ పురస్కారాన్ని అందుకొన్నారు. నేపథ్యగాయకులైన మన్నాడే, లతా మంగేష్కర్, ఆశా భోంస్లే కూడా ఈ అవార్డు గ్రహీతల్లో వున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories