Roar Of RRR: దుమ్ములేపుతున్న ఆర్‌ఆర్‌ఆర్ మేకింగ్ వీడియో
Roar Of RRR: ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్‌ను ఆర్‌ఆర్‌ఆర్ మూవీ టీం సర్ప్రైజ్ చేసింది.
Roar Of RRR: దుమ్ములేపుతున్న ఆర్‌ఆర్‌ఆర్ మేకింగ్ వీడియో
Roar Of RRR: ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్‌ను ఆర్‌ఆర్‌ఆర్ మూవీ టీం సర్ప్రైజ్ చేసింది. చిత్ర బృందం సినిమా మేకింగ్ వీడియో రిలీజ్ చేసింది. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న పాన్ ఇండియన్ సినిమా 'ఆర్ఆర్ఆర్ కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో రోర్ ఆఫ్ ఆర్‌ఆర్‌ఆర్' పేరుతో బయటకు వచ్చిన ఈ వీడియో ప్రతి ఒక్కర్నీ ఎంతగానో ఆకర్షిస్తోంది. చరణ్, తారక్‌లకు సంబంధించిన కొన్ని సన్నివేశాల చిత్రీకరణను ఇందులో చూపించారు. భారీ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌ని సైతం ఈ వీడియో ద్వారా ప్రేక్షకులకు రుచి చూపించారు. ఈ ఏడాది అక్టోబరు 13న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
Next Story




