రాజమౌళి ఎఫెక్ట్ కొరటాల శివ మీదే పడుతుందా?

Rajamouli: ఇప్పటిదాకా టాలీవుడ్ లో ఒక్క ఫ్లాప్ సినిమా కూడా లేని డైరెక్టర్లలో రాజమౌళి పేరు ముందే ఉంటుంది.

Arun Chilukuri
Updated on: 30 April 2022 8:00 PM IST
Rajamouli Sentiment Repeat Once Again
X

రాజమౌళి ఎఫెక్ట్ కొరటాల శివ మీదే పడుతుందా?

Rajamouli: ఇప్పటిదాకా టాలీవుడ్ లో ఒక్క ఫ్లాప్ సినిమా కూడా లేని డైరెక్టర్లలో రాజమౌళి పేరు ముందే ఉంటుంది. తన అద్భుతమైన సినిమాలతో తెలుగు ఇండస్ట్రీ స్థాయిని పెంచే రాజమౌళి విషయంలో ఒక ఆసక్తికరమైన సెంటిమెంట్ కూడా ఉంది. రాజమౌళి ఏ సినిమా తీసినా ఆ సినిమాలో నటించిన హీరో నెక్స్ట్ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారుతుంది అని అభిమానులు మాత్రమే కాక చాలామంది సినీ ప్రముఖులు కూడా నమ్ముతారు. ఈగ సినిమా తర్వాత నాని డిజాస్టర్ లు అందుకున్నారు. ఇక బాహుబలి తర్వాత ప్రభాస్ సాహో కూడా ఫ్లాప్ అయింది.

ఈ విషయం గురించి ఎప్పుడూ అడిగినా అలాంటిదేమీ లేదని, సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అని తీసే విధానం లో కూడా ఉంటుంది కానీ తన వల్ల కాదని కొట్టి పారేశారు. ఇక తాజాగా ఆర్ ఆర్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు హీరోలుగా నటించారు. ఇక రామ్ చరణ్ ముఖ్యపాత్ర పోషించిన ఆచార్య సినిమా ఏప్రిల్ 29న విడుదల అయి బాక్సాఫీసు వద్ద డిజాస్టర్గా నిలిచింది. కొరటాల ఈ సినిమా కి దర్శకత్వం వహించారు. ఇక ఎన్టీఆర్ కూడా నెక్స్ట్ సినిమాని కొరటాల డైరెక్షన్ లోనే చేస్తున్నారు. చూస్తూ ఉంటే ఈసారి రాజమౌళి ఎఫెక్ట్ కొరటాల శివ మీదే పడేట్టు కనిపిస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story