Sekhar Kammula: హీరో హీరోయిన్లను రిపీట్ చేస్తున్న శేఖర్ కమ్ముల

* ఇప్పటిదాకా హీరోయిన్లను రిపీట్ చేసిన శేఖర్ కమ్ముల హీరోలను మాత్రం రిపీట్ చేసింది లేదు

admin1
Updated on: 21 Sept 2021 8:45 PM IST
Rajamouli Said that he will Definitely Make Another Film with Naga Chaitanya
X

శేఖర్ కమ్ముల-నాగ చైతన్య (ఫోటో-ది హన్స్ ఇండియా)

Sekhar Kammula: శేఖర్ కమ్ముల లాంచ్ చేసిన చాలామంది హీరో హీరోయిన్లు ఇప్పుడు స్టార్లుగా టాలీవుడ్ లో సెటిల్ అయిపోయారు. కానీ శేఖర్ కమ్ముల మాత్రం వారితో మళ్లీమళ్లీ సినిమాలు మాత్రం చేయడం లేదు. ఇప్పటిదాకా హీరోయిన్లను రిపీట్ చేసిన శేఖర్ కమ్ముల హీరోలను మాత్రం రిపీట్ చేసింది లేదు. ప్రస్తుతం "లవ్ స్టోరీ" ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న శేఖర్ కమ్ములకి ఇదే ప్రశ్న ఎదురైంది. "ఫిదా" సినిమా తర్వాత సాయి పల్లవి ని "లవ్ స్టోరీ" లో కూడా హీరోయిన్ గా తీసుకున్నారు. దానికి కారణం ఏంటి అని అడగగా, శేఖర్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు.

"సినిమాలో హీరోయిన్ పాత్ర తెలంగాణ యాసలో మాట్లాడాలి. అంతే కాకుండా సినిమా డాన్స్ బ్యాక్ డ్రాప్ తో నడుస్తుంది. హీరో హీరోయిన్ ఇద్దరు డాన్స్ చేయాల్సి ఉంటుంది. అందుకే సాయి పల్లవిని మళ్లీ ఈ సినిమాలో కూడా ఎంపిక చేసుకున్నాం" అని చెప్పారు శేఖర్ కమ్ముల. మరి హీరోలను ఎందుకు రిపీట్ చేయట్లేదు అని అడగగా నాగచైతన్యతో ఖచ్చితంగా మరొక సినిమా చేస్తానని చెప్పుకొచ్చారు. ధనుష్ హీరోగా ఒక మల్టీ లింగువల్ సినిమా ప్లాన్ చేస్తున్న శేఖర్ కమ్ముల ఈ సినిమా తర్వాత మళ్లీ నాగచైతన్యతో హీరోగా సినిమా చేయబోతున్నట్లు సమాచారం.

admin1

admin1

Next Story