'ఆర్ ఆర్ ఆర్' సినిమాతో ట్విస్ట్ ఇవ్వనున్న రాజమౌళి

rrr
x
rrr
Highlights

ప్రస్తుతం అందరి కళ్ళు రాజమౌళి దర్శకత్వంలో, రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కనున్న 'ఆర్ ఆర్ ఆర్' పైనే ఉన్నాయి. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఇప్పటికీ పూర్తి అయిపోయింది.

ప్రస్తుతం అందరి కళ్ళు రాజమౌళి దర్శకత్వంలో, రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కనున్న 'ఆర్ ఆర్ ఆర్' పైనే ఉన్నాయి. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఇప్పటికీ పూర్తి అయిపోయింది. కార్తికేయ పెళ్లి తరువాత రెండవ షెడ్యూల్ పట్టాలెక్కనుంది. ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనే దానిపై ఇప్పటికే చాలా పుకార్లు బయటకొచ్చాయి ఈ సినిమా పూర్వజన్మల నేపథ్యంలో నడుస్తుందని, 1930 లో మొదలై 2018 వరకు నడుస్తుందని కొందరు అంటున్నారు. ఇదిలా ఉంటే మరికొందరు ఈ సినిమా తో రాజమౌళి మరో షాక్ ఇవ్వనున్నారు అని చెప్పుకుంటున్నారు.

'బాహుబలి' లాగానే 'ఆర్ ఆర్ ఆర్' సినిమాని కూడా రెండు భాగాలుగా విడుదల చేయనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. 'బాహుబలి' తో ఇప్పటికే రికార్డులను తిరగ రాసిన రాజమౌళి ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' సినిమాకు అదే ఫార్ములాని వాడి రెండు భాగాలుగా విడుదల చేయాలనుకుంటున్నారట. అయితే 'బాహుబలి' సినిమా మొదటి భాగం చివర్లో "కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడు?" అనే ప్రశ్నను అందరి మనసుల్లో రేకెత్తించిన రాజమౌళి మొదటి భాగం చివరలో కూడా ఇలాంటి ట్విస్ట్ ఏదో ఒకటి ఇస్తారని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మరి ఈ సినిమా 'బాహుబలి' రికార్డులను బద్దలు కొడుతుందో లేదో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories