Top
logo

RRR Movie poster: మక్కికి మక్కి దింపేశారు.. RRR పోస్టర్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్

RRR Movie poster:
X

RRR Movie poster

Highlights

దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్.

దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్. సోమవారం ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. ఈ ఏడాది అక్టోబర్ లో విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. అంతే కాదు ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్ ను వదిలారు. ఈ పోస్టర్ ప్రేక్షకలోకాన్ని విశేషంగా ఆకట్టుకున్నప్పటికీ ఓ వర్గం వాళ్ళు మాత్రం ఇది కాపీ అంటూ రాజమౌళిపై ట్రోల్స్ మొదలుపెట్టారు. దీంతో ఈ ఇష్యూ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

ఈ పోస్టర్‌లో రామ్ చరణ్ గుర్రంపై వెళుతున్నట్లు ఉండగా, ఎన్టీఆర్ బైక్‌పై జెట్ స్పీడుతో దూసుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. జక్కన్న విడుదల చేసిన RRR పోస్టర్ విషయంలో ట్రోల్స్ వస్తున్నాయి. ఈ పోస్టర్ కాపీ అంటూ ఆన్‌లైన్ వేదికలపై రచ్చ స్టార్ట్ చేశారు కొందరు నెటిజన్లు. ఇది కాపీ అనే ఆరోపణలు రావడం పెద్ద సంచలనంగా మారింది. గతంలోనూ రాజమౌళి సినిమాలపై విషయంలోనూ ఇదే జరిగింది. తాజా పోస్టర్ హాలీవుడ్ మూవీ 'ఘోస్ట్ రైడర్' నుంచి కాపీ చేశారంటూ నెటిజన్లు రాజమౌళిపై ట్రోలింగ్ చేస్తున్నారు.

డీవీవీ దానయ్య దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.'ఆర్‌ఆర్‌ఆర్‌'సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటుంది. బాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఆలియాభట్‌ రామ్ చరణ‌్ సరసన సీత పాత్రలో మెప్పించనున్నారు. ఎన్టీఆర్ కు జోడీగా హాలీవుడ్‌ భామ ఒలీవియా మోరీస్ సందడి చేయనున్నారు. అలిసన్‌ డూడీ, రే స్టీవెన్‌ సన్, బాలీవుడ్‌ నటుడు అజయ్‌దేవ్‌గణ్‌, శ్రియ, సముద్రఖని కీలకపాత్రల్లో కనిపించనున్నారు.Web TitleRajamouli RRR Movie poster Trolls
Next Story