Rajamouli: ఆస్కార్ బరిలో దిగనున్న రాజమౌళి సినిమాలు

Rajamouli: అమెరికన్ ఫిలిం ఫెస్టివల్ లో రాజమౌళి సినిమాల హవా

Jyothi
Published on: 10 Sept 2022 11:03 AM IST
Rajamouli Movies Might get Oscar Nomination
X

Rajamouli: ఆస్కార్ బరిలో దిగనున్న రాజమౌళి సినిమాలు 

Rajamouli: తెలుగు చిత్ర పరిశ్రమని ఒకేసారిగా పది మెట్లు ఎక్కించిన ఘనత ఎస్ఎస్ రాజమౌళికే దక్కుతుంది. బాహుబలి, "ఆర్ఆర్ఆర్" వంటి బ్లాక్ బస్టర్లతో తెలుగు చిత్ర తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని ఎంతగానో పెంచిన డైరెక్టర్ రాజమౌళి. రీజనల్ సినిమాని ప్యాన్ ఇండియా స్థాయికి తీసుకువెళ్లి ఇప్పుడు ప్రపంచమంతా టాలీవుడ్ వైపు చూసేలా చేసిన డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి. "సై" అనే సినిమాతో రగ్బీ ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు రాజమౌళి. ఆ తరువాత రామ్ చరణ్ మరియు కాజల్ హీరో హీరోయిన్లుగా నటించిన "మగధీర" సినిమాతో తెలుగు ప్రేక్షకులు ఇంతకుముందు ఎప్పుడూ చూడనటువంటి ప్రేమ కథను చూపించారు.

"ఈగ" సినిమాతో కనీ విని ఎరుగని రీతిలో ఒక ఈగ పగ తీర్చుకునే కథను చెప్పారు రాజమౌళి. అదే సినిమాతో బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టారు. ఇక బాహుబలి సినిమాతో ప్యాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసిన రాజమౌళి అంచలంచలుగా ఎదుగుతూ వచ్చారు. తాజాగా ఇప్పుడు అమెరికన్ ఫిలిం ఫెస్టివల్లో పదవ ఎడిషన్ బియాండ్ ఫెస్ట్ ఇన్ లాస్ ఏంజిల్స్ లో రాజమౌళి సినిమాలు ప్రదర్శించబడుతున్నాయి. "ఆర్ ఆర్ ఆర్", "బాహుబలి 1 & 2", "ఈగ", "మగధీర", "మర్యాద రామన్న" సినిమాలు ఈ వేడుకలో ప్రదర్శింపబడతాయి. "ఆర్ ఆర్ ఆర్" ఆస్కార్ కి కూడా నామినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు.

Jyothi

Jyothi

Next Story