రాయల్ ఆల్బర్ట్ హాల్ లో 'బాహుబలి'

జక్కన రాజమౌళి దర్శకత్వం వహించిన 'బాహుబలి 2' సినిమా విడుదలై ఇప్పటికి రెండేళ్లు అయింది కానీ సినిమా మాత్రం ఇంకా...
జక్కన రాజమౌళి దర్శకత్వం వహించిన 'బాహుబలి 2' సినిమా విడుదలై ఇప్పటికి రెండేళ్లు అయింది కానీ సినిమా మాత్రం ఇంకా రికార్డుల వర్షం కురిపిస్తూనే ఉంది. ఎదో ఒక రకంగా మళ్ళీ తెలుగు ప్రేక్షకులను ఆ దృశ్యకావ్యాన్ని గుర్తుతెచ్చుకునేలా, తెలుగు వారిని గర్వపడేలా చేస్తూనే ఉంది. తాజాగా 'బాహుబలి 1' చిత్రానికి ఒక గొప్ప హానర్ లభించనుంది. తాజా సమాచారం ప్రకారం 'బాహుబలి 1' చిత్రాన్ని ప్రతిష్టాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్ ఫిల్మ్ కాన్సర్ట్ లో ప్రదర్శించనున్నారు. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాలతో పాటు మన 'బాహుబలి 1' ని ఎంపిక చేయడం జరిగింది.
హాలీవుడ్ చిత్రాలు 'స్కైఫాల్', 'హరీ పాటర్ అండ్ ది గోబ్లెట్ ఆఫ్ ఫైర్' సినిమాలతో పాటు 'బాహుబలి 1' సినిమాను కూడా ఇందులో ప్రదర్శించనున్నారు. అంతేకాకుండా సినిమా ప్రదర్శించే ముందు ఒక లైవ్ కాన్సర్ట్ కూడా జరగనుంది. అక్టోబర్ 19న జరగనున్న ఈ వేడుకలో చిత్ర దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి కూడా హాజరవ్వనున్నారు. చిత్రం గురించి, చిత్ర సంగీతం గురించి కొన్ని విశేషాలు ఈ వేడుకలో పంచుకోనున్నారు. కీరవాణి తో పాటే రాజమౌళి కూడా అక్కడ ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అవ్వనున్నారు. రాయల్ ఆల్బర్ట్ హాల్ కాన్సర్ట్ లో ప్రదర్శింప పడనున్న మొట్టమొదటి భారతీయ చిత్రం 'బాహుబలి' కావడం విశేషం.
తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
25 Jun 2022 7:28 AM GMTప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి
25 Jun 2022 5:43 AM GMTCM Jagan: సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం
24 Jun 2022 6:43 AM GMTకేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై రాజకీయ దూమారం.. అసలు ఎవరీ స్వప్న సురేష్?
23 Jun 2022 11:15 AM GMTసికింద్రాబాద్ అల్లర్ల కేసులో కీలక పరిణామం.. విధ్వంసం రోజు..
23 Jun 2022 10:41 AM GMTAfghanistan: ఆఫ్ఘనిస్తాన్లోని పక్టికా రాష్ట్రంలో భారీ భూకంపం
22 Jun 2022 10:01 AM GMTకృష్ణా జిల్లా కంకిపాడులో క్యాసినో కలకలం
22 Jun 2022 9:33 AM GMT
విషాదం.. పెళ్లైన కొద్ది గంటలకే నవ వరుడు మృత్యు ఒడికి..
25 Jun 2022 10:15 AM GMTఆన్లైన్లో రైల్వే టికెట్ బుక్ చేస్తున్నారా.. ఈ పనిచేయకపోతే పెద్ద...
25 Jun 2022 10:00 AM GMTపెళ్లి కాలేదని నమ్మించి రెండో పెళ్లి.. మొదటి భార్య పాత్ర..
25 Jun 2022 9:49 AM GMTమంత్రి ఆదిమూలపు సురేశ్కి మరోసారి అస్వస్థత.. వాకింగ్ చేస్తూ..
25 Jun 2022 9:16 AM GMTజేఎన్టీయూలో ర్యాగింగ్ కలకలం.. 11 మంది విద్యార్థులు సస్పెండ్..
25 Jun 2022 9:02 AM GMT