రాజమౌళి పోస్టుకు మహేష్ అదిరిపోయే రిప్లే.. ఖుషీ అవుతున్న ఫ్యాన్స్..

Rajamouli Interesting Post
x

రాజమౌళి పోస్టుకు మహేష్ అదిరిపోయే రిప్లే.. ఖుషీ అవుతున్న ఫ్యాన్స్..

Highlights

హీరో మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో SSMB29 సినిమా త్వరలో పట్టాలెక్కనుంది. ఈ సారి మహేష్ బాబుతో ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేయాలని చూస్తున్నారు రాజమౌళి.

Rajamouli Interesting Post: హీరో మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో SSMB29 సినిమా త్వరలో పట్టాలెక్కనుంది.ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీ కోసం ఇటు మహేష్ అభిమానులు, అటు రాజమౌళి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి చిత్రబృందం ఎలాంటి సమాచారం ఇవ్వడంలేదు. కనీసం మొదలు పెట్టినట్టు కూడా చెప్పకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఈ క్రమంలో దర్శకుడు రాజమౌళి ఓ పోస్ట్ పెట్టారు. అది చూసిన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

రాజమౌళి ఆ మధ్య కెన్యా అడవుల్లో లొకేషన్స్ వేటకు వెళ్లారు. ఆ తర్వాత ఓ సింహం ఎదుట ఉన్న ఫోటోను షేర్ చేశారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరాయి. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేశారు రాజమౌళి. రాజమౌళి వెనక ఓ సింహాం కనిపిస్తుంది. ఆ వీడియోలో సింహాన్ని బోనులో బంధించినట్టు చూపించిన రాజమౌళి.. పాస్ పోర్టును చూపిస్తూ నవ్వుతూ కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే పాస్ పోర్ట్ లాక్కొని సింహాన్ని లాక్ చేశా అని అర్థం వచ్చేలా ఈ వీడియోలో కనిపిస్తోంది. మహేష్ బాబు తరచూ ఫ్యామిలీతో విదేశాలకు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన పాస్ పోర్ట్ తీసుకుని సినిమా షూటింగ్ కోసం లాక్ చేశా అనే హింట్ ఇస్తూ రాజమౌళి ఆసక్తికర పోస్ట్ పెట్టారు.దీనికి మహేష్ బాబు అదిరిపోయే రిప్లే ఇచ్చారు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అంటూ డైలాగ్ కొట్టారు మహేష్. పోకిరి మూవీ డైలాగ్ మళ్లీ మహేష్ నోటి వెంట రావడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో నటించే హీరోయిన్స్ గురించి కూడా ఆసక్తికర చర్చ సాగింది. మొదట్లో విదేశీ నటి సిసిమాలో నటిస్తున్నట్టు టాక్ వినిపించింది. ఆ తర్వాత మరికొందరి పేర్లు వినిపించాయి. అయితే ఫైనల్ గా ప్రియాంక చోప్రాను రాజమౌళి ఓకే చేసినట్టు తెలుస్తోంది.అంతేకాదు ఇటీవల ప్రియాంక హైదరాబాద్‌కు రావడంతో మహేష్ సినిమా కోసమే వచ్చారని అభిమానులు ఫిక్స్ అయ్యారు. భారీ బడ్జెట్‌తో SSMB29ను హాలీవుడ్ రేంజ్‌లో తీయబోతున్నట్టు సమాచారం.

రాజమౌళి-మహేష్ సినిమా కోసం సినీ ప్రియులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరి భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి మరి.


Show Full Article
Print Article
Next Story
More Stories