Keeravani: ఇలాంటి సినిమా ఇంతకు ముందు రాలేదు.. మహేష్‌- రాజమౌళి మూవీపై కీరవాణి

Keeravani Calls Mahesh Babu Rajamouli Film His Toughest Yet Nothing Like This Before
x

Keeravani: ఇలాంటి సినిమా ఇంతకు ముందు రాలేదు.. మహేష్‌- రాజమౌళి మూవీపై కీరవాణి

Highlights

Keeravani: మహేశ్‌ బాబు, రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.

Keeravani: మహేశ్‌ బాబు, రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. జక్కన్న సైలెంట్‌గా ఈ సినిమా షూటింగ్‌ జరుపుతున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన చేయకపోయిన్పటికీ చిత్రీకరణ మాత్రం జరుగుతోంది. SSMB29 వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో ప్రియాంకచోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.

కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి కీరవాణి పలు ఆసక్తికర వ్యాఖ్యలు పంచుకున్నారు. ఇప్పటి వరకూ తాను పని చేసిన వాటిల్లో ఇది కష్టమైన ప్రాజెక్టు అని తెలిపారు. ప్రతి సినిమాకీ సవాళ్లు పెరుగుతూనే ఉంటాయని, దానికి తగ్గట్టు కొత్త సౌండ్స్‌ సృష్టించాలని కీరవాణి తెలిపారు. మహేష్‌-రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమాను ఉద్దేశిస్తూ.. ఇంతకు ముందెన్నడూ ఇలాంటి మూవీ రాలేదని అనుకుంటున్నాని తెలిపారు.

ఇదొక అడ్వెంచర్‌, కష్టమే అయినా ఆసక్తికర ప్రయాణం అని కీరవాణి అభిప్రాయపడ్డారు. ఇక విశ్వంభర చిత్రం గురించి కూడా కొన్ని విషయాలను కీరవాణి పంచుకున్నారు. దాపు మూడు దశాబ్దాల తర్వాత చిరంజీవితో ‘విశ్వంభర’ చిత్రానికి పని చేస్తున్నానని, బాలీవుడ్‌లో ‘తన్వి: ది గ్రేట్‌’కి స్వరాలు సమకూరుస్తున్నట్లు చెప్పుకొచ్చారు. సంగీతం విషయంలో కేవీ మహదేవన్‌, ఆర్‌.డి. బర్మన్‌ లాంటి వ్యక్తుల ప్రభావం తనపై ఎంతో ఉందన్న కీరవాణి.. వాళ్లిద్దరే కాదు కొత్తగా ప్రయత్నించే ప్రతి సంగీత దర్శకుడి నుంచి ఎంతో కొంత నేర్చుకుంటూ ఉంటా అని కీరవాణి చెప్పుకొచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories