Rajamouli: యువ హీరో సినిమాకి రాజమౌళి సూచనలు

Rajamouli: యువ హీరో సినిమాకి రాజమౌళి సూచనలు

Rama Rao
Updated on: 23 Sept 2022 8:30 AM IST
Rajamouli Instructions at young hero Sri Simhas movie
X

Rajamouli: యువ హీరో సినిమాకి రాజమౌళి సూచనలు

Rajamouli: ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి తనయుడు శ్రీ సింహ "మత్తు వదలరా" సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీ సింహ రెండవ సినిమా "తెల్లవారితే గురువారం" సినిమాతో మాత్రం పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయారు. తాజాగా ఇప్పుడు "దొంగలున్నారు జాగ్రత్త" అనే ఒక థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఓకే లొకేషన్ లో షూట్ చేసిన ఈ సినిమా ఒక ప్రయోగాత్మక చిత్రంగా చెప్పుకోవచ్చు.

సురేష్ బాబు మరియు సునీత తాటి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబర్ 23న థియేటర్లోకి రాబోతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పటికే తన కుటుంబ సభ్యులకు ఈ సినిమాని చూపించాడు శ్రీ సింహ.రాజమౌళి కూడా ఈ సినిమా చూసి చాలా సంతోషంగా ఫీల్ అయ్యారట కానీ సినిమాలో కొన్ని కీలకమైన సూచనలు మరియు మార్పులు చెప్పారని తెలుస్తోంది. "ఈ సినిమా గురించి ముందు మా ఇంట్లో ఏమీ చెప్పలేదు.

సినిమా పూర్తయ్యాక ఫ్యామిలీ కోసం ఒక స్పెషల్ షో వేశాము. సినిమా చూసిన రాజమౌళి గారు చాలా ఆనందం వ్యక్తం చేశారు. చిన్న చిన్న మార్పులు కూడా చెప్పారు. ఆ మార్పులు చేసిన తర్వాత ఆ సినిమా ఇంకా స్ట్రాంగ్ అయింది సర్వైవల్ థ్రిల్లర్ సినిమాలు హాలీవుడ్ లో చాలానే ఉన్నాయి. కానీ ఇక్కడ అలాంటి జోనర్ ని మేమే మొదలు పెట్టడం చాలా ఎక్సైటింగ్ గా ఉంది. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని నమ్మకం ఉంది," అని చెప్పుకొచ్చాడు శ్రీ సింహ.

Rama Rao

Rama Rao

Next Story