రెండు పాటలను దాచేసిన రాజమౌళి

Rajamouli  Hid Two Songs | Telugu Online News
x

రెండు పాటలను దాచేసిన రాజమౌళి

Highlights

రెండు పాటలను దాచేసిన రాజమౌళి

SS Rajamouli: "ఆర్ ఆర్ ఆర్" సినిమా పైన ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలన్నీ చార్ట్ బస్టర్ లుగా మారాయి. నాటు నాటు, ఎత్తర జెండా పాటలు అందరి దృష్టినీ బాగానే ఆకర్షించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరొక రెండు పాటలు ఉన్నాయట. కానీ అవి నేరుగా థియేటర్లలోనే చూడాలని తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ రెండు పాటలు ఆలియాభట్ వి కావటం. ఒకటి ఆలియా భట్ సోలో సాంగ్ కాగా మరొకటి రామ్ చరణ్ తో ఆమె డ్యూయెట్ అట.

అయితే ఇప్పటికే ప్రమోషన్ లతో బిజీగా ఉన్న రాజమౌళికి ఈ రెండు పాటలను విడుదల చేయటం కుదరటం లేదు. కానీ ఈ విషయంలో ఆలియాభట్ కూడా కొంచెం అసంతృప్తిగా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆలియా భట్ ప్రమోషన్లలో కూడా హాజరు కావడం లేదని కొందరు అడుగుతున్నారు. ఢిల్లీ ఈవెంట్ లో తప్ప ఆలియాభట్ పెద్దగా ప్రమోషన్లలో కనిపించడం లేదు. అయితే మరికొందరు మాత్రం రాజమౌళికి ఏ పాటను ఎప్పుడు ఎలా ఎక్కడ విడుదల చేయాలో బాగా తెలుసని ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇవ్వడానికి ఆ రెండు పాటలని బయటకు రాకుండా ఉంచారని చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories