రామ్ చరణ్ - సుకుమార్ సినిమా గురించి హింట్ ఇచ్చిన రాజమౌళి

Rajamouli Eagerly Waiting For Sukku-Charan Film
x

రామ్ చరణ్ - సుకుమార్ సినిమా గురించి హింట్ ఇచ్చిన రాజమౌళి

Highlights

SS Rajamouli: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లలో ఒకరు ఎస్ఎస్ రాజమౌళి కాగా మరొకరు సుకుమార్ అని చెప్పవచ్చు.

SS Rajamouli: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లలో ఒకరు ఎస్ఎస్ రాజమౌళి కాగా మరొకరు సుకుమార్ అని చెప్పవచ్చు. "బాహుబలి" సినిమాతో రాజమౌళి లాగానే "పుష్ప" సినిమాతో సుకుమార్ కూడా ప్యాన్ ఇండియా స్థాయిలో మంచి విజయాన్ని అందుకున్నారు. రామ్ చరణ్ మరియు సుకుమార్ కాంబినేషన్లో సినిమా కోసం తను చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఈ సినిమాకి సంబంధించిన ఒక సీన్ గురించి రాజమౌళి చెప్పటం అభిమానులను సైతం షాక్ కి గురిచేసింది. "ఈ సినిమాకి సంబంధించిన ఓపెనింగ్స్ సీన్ ను రామ్ చరణ్ నాకు నరేట్ చేసినప్పుడు నేను స్టన్ అయిపోయాను. రామ్ చరణ్ సుక్కు కాంబినేషన్ కోసం ఎదురుచూస్తున్నాను," అని అన్నారు రాజమౌళి.

గతంలో రామ్ చరణ్ తో సుకుమార్ చేయబోయే సినిమా పుష్ప సినిమా కి కూడా కనెక్ట్ అయ్యి ఒక సినిమాటిక్ యూనివర్స్ లాగా ఉంటుందని ఒక గోదావరి అబ్బాయిగా చిత్తూరు అడవుల్లో పుష్పరాజ్ ని రామ్ చరణ్ కలవబోతున్నాడని వార్తలు వినిపించాయి. కానీ దీంట్లో నిజానిజాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

ఏదేమైనా అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ రాజమౌళి స్వయంగా చెప్పడంతో రామ్ చరణ్ మరియు సుకుమార్ కాంబినేషన్ లో కచ్చితంగా ఒక సినిమా రాబోతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం "పుష్ప: ది రూల్" సినిమా షూటింగ్ తో సుకుమార్ బిజీగా ఉన్నారు. మరోవైపు రామ్ చరణ్ కూడా శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం వీరిద్దరి కమిట్మెంట్ లు పూర్తయిన తర్వాత వీరి సినిమా మొదలవ్వచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories