రామ్ చరణ్ ఎన్టీఆర్ ల పై ప్రశంసల వర్షం కురిపిస్తున్న రాజమౌళి

రామ్ చరణ్ ఎన్టీఆర్ ల పై ప్రశంసల వర్షం కురిపిస్తున్న రాజమౌళి

admin1
Updated on: 16 March 2022 11:01 AM IST
Rajamouli Appreciated on Ram Charan and NTR
X

రామ్ చరణ్ ఎన్టీఆర్ ల పై ప్రశంసల వర్షం కురిపిస్తున్న రాజమౌళి

SS Rajamouli: తాజాగా "ఆర్ ఆర్ ఆర్" బృందం మీడియాతో ముచ్చటించింది. సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టింది. పీరియడ్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథ సినిమా కథ మొత్తం ఇద్దరు స్నేహితులు మధ్య తిరిగే కథ అని తెలుస్తోంది. బాహుబలి సిరీస్ కంటే ఈ సినిమా ఇంకా భారీ బడ్జెట్ సినిమాల గా కనిపిస్తుంది అని అడగగా రాజమౌళి చాలా తెలివిగా జవాబిచ్చారు. ఆ ప్రశ్నలోనే జవాబు ఉందని, ఇక ఎవరు ఎలా అనుకుంటే వాళ్ళకి అది అలా కనిపిస్తుంది అని అన్నారు రాజమౌళి. ఇక రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ల పై ప్రశంసల వర్షం కురిపించారు రాజమౌళి.

ఎన్టీఆర్ ఒక సూపర్ కంప్యూటర్ అని అతని మెమరీ చాలా గొప్పది అని అన్నారు రాజమౌళి. ఇక రామ్ చరణ్ ఒక తెల్లని కాగితం అని డైరెక్టర్ ఎలా చెబితే అలానే చేస్తారని అన్నారు. ఇక పెద్ద సినిమాలకు ఐదు షో లకు పర్మిషన్ ఇచ్చినందుకు, మరియు టికెట్ రేట్లు పెంచినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు చెప్పారు రాజమౌళి. సినిమా చేస్తున్నప్పుడు ఏ సన్నివేశానికి బాగా భయపడ్డారు అని అడగగా రాజమౌళి ఎమోషనల్ సన్నివేశాలు రీ క్రియేట్ చేయడానికి చాలా భయపడ్డాను అని చెప్పారు. ఇక "నాటు నాటు" పాట వెండితెరపై చాలా బాగుంటుందని అన్నారు.

admin1

admin1

Next Story