Rajamouli: దర్శక ధీరుడు ట్వీట్..దోస్తులతో అంజి మామ కల్లు దావత్

Rajamouli: దర్శక ధీరుడు ట్వీట్..దోస్తులతో అంజి మామ కల్లు దావత్
x

Rajamouli: దర్శక ధీరుడు ట్వీట్..దోస్తులతో అంజి మామ కల్లు దావత్

Highlights

యంగ్ టాలెంట్ సుమంత్ ప్రభాస్ హీరోగా స్వీయ రచనా దర్శకత్వంలో రూపుదిద్దుకున్నమేమ్ ఫేమస్ మూవీపై సూపర్ స్టార్ మహేష్ బాబు పాజిటివ్ రివ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ లిస్ట్ లో ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళి చేరాడు.

Mem Famous: రైటర్ పద్మభూషణ్ సినిమాతో ఆకట్టుకున్న ఛాయ్ బిస్కెట్ సంస్థ నుంచి తాజాగా విడుదలైన సినిమా మేమ్ ఫేమస్. యంగ్ టాలెంట్ సుమంత్ ప్రభాస్ హీరోగా స్వీయ రచనా దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీపై సూపర్ స్టార్ మహేష్ బాబు పాజిటివ్ రివ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ లిస్ట్ లో ఇప్పుడు మరో సినీ ప్రముఖుడు చేరాడు. ఆయన మరెవరో కాదు దర్శక ధీరుడు రాజమౌళి.

చాలా రోజుల తర్వాత థియేటర్ లో ఓ సినిమా ఎంజాయ్ చేశానంటూ మేమ్ ఫేమస్ గురించి ట్వీట్ చేశాడు. అంతేకాదు, సుమంత్ కోసం ఈ సినిమా చూడాలని సినీ అభిమానులను కోరడమే కాకుండా..అంజి మామ యాక్టింగ్ చాలా నేచురల్ గా ఉందంటూ ప్రశంసించాడు. దర్శకధీరుడు రాజమౌళి స్వయంగా తన నటనను ప్రస్తావిస్తూ మెచ్చుకోవడంతో అంజి మామ తెగ సంబరపడిపోతున్నాడు. ఈ సంబరాల్లో భాగంగా తన దోస్తులకు దావత్ ఇచ్చిన వీడియోని అంజి మామ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

అంజి మామ తన దోస్తులతో కలిసి కల్లు తాగాడు. ఈ హుషారులో మంచి కవిత కూడా వినిపించాడు. జిందగీ మే క్యా మిల్తా హై..జీనేవాలే కో రోటీ..మర్ నేవాలో కో మిట్టీ..మేరే కో రాజమౌళి సర్ ట్వీట్ కియా అంటూ అంజిమామ దిల్ ఖుష్ అయ్యాడు. అంజిమామకు ఇదే తొలి సినిమా..తన డెబ్యూ మూవీతోనే రాజమౌళిని మెప్పించడం నిజంగానే మాటలు కాదు..


Show Full Article
Print Article
Next Story
More Stories