ఒక హిట్టు కోసం ఎదురుచూస్తున్న రాజ్ తరుణ్

*ఒక హిట్టు కోసం ఎదురుచూస్తున్న రాజ్ తరుణ్

Rama Rao
Published on: 21 July 2022 12:45 PM IST
Raj Tarun is Waiting For a Hit Movie | Tollywood
X

ఒక హిట్టు కోసం ఎదురుచూస్తున్న రాజ్ తరుణ్

Raj Tarun: ఈమధ్య కాలంలో యువ హీరో రాజ్ తరుణ్ టైం ఏమాత్రం బాగుండటం లేదు. "ఉయ్యాల జంపాలా" వంటి సూపర్ హిట్ సినిమాతో హీరోగా పరిచయమైన రాజ్ తరుణ్ "సినిమా చూపిస్త మామ", "కుమారి 21ఎఫ్", "నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్", "కిట్టు ఉన్నాడు జాగ్రత్త" వంటి మంచి హిట్ సినిమాలను అందించారు. కానీ ఈ మధ్య కాలంలో రాజ్ తరుణ్ కి ఒక్క హిట్ సినిమా కూడా లేదు. "అందగాడు" సినిమాతో యావరేజ్ హిట్ మాత్రమే అందుకున్న రాజ్ తరుణ్ ఆ తర్వాత ఏడెనిమిది సినిమాలు చేశారు కానీ అందులో ఒక్కటి కూడా తనకి మంచి హిట్ ఇవ్వలేకపోయింది.

ఈ మధ్యనే గతేడాది చివర్లో "స్టాండప్ రాహుల్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఆ సినిమా పైనే తన ఆశలన్నీ పెట్టుకున్న రాజ్ తరుణ్ ఆ సినిమాతో కూడా ప్రేక్షకులను అలరించలేకపోయారు. ఆ తర్వాత రాజ్ తరుణ్ కథలను వింటున్నట్లు కూడా ప్రచారం సాగలేదు.ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తుంటే రాజ్ తరుణ్ మార్కెట్ బాగా పడిపోయిందని చెప్పుకోవచ్చు. వరుస డిజాస్టర్లతో రాజ్ తరుణ్ వేగం కూడా బాగా తగ్గిపోయింది. నిర్మాతలు సైతం రాజ్ తరుణ్ తో సినిమా అంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో రాజ్ తరుణ్ కి ఒక మంచి బ్లాక్ బస్టర్ పడాల్సిన అవసరం బాగా ఉంది. మరి ఆ సూపర్ హిట్ సినిమా రాజ్ తరుణ్ కి ఎప్పుడు దక్కుతుందో చూడాలి.

Rama Rao

Rama Rao

Next Story