'ఇద్దరి లోకం ఒకటే' అంటున్న రాజ్ తరుణ్

Ruthvik
Published on: 22 April 2019 4:53 PM IST
ఇద్దరి లోకం ఒకటే అంటున్న రాజ్ తరుణ్
X

కెరీర్ మొదట్లో కొన్ని హిట్ సినిమాలు నమోదు చేసుకున్నప్పటికీ, గత కొంతకాలంగా యువ హీరో రాజ్ తరుణ్ కెరీర్ లో ఒక్క మంచి హిట్ కూడా లేదు. గతేడాది రాజ్ తరుణ్ నటించిన 'రంగుల రాట్నం', 'రాజుగాడు', 'లవర్' సినిమాలు మూడు డిసాస్టర్లు గానే మారాయి. ఇక రాజ్ తరుణ్ కెరీర్ ముగిసిపోయింది అనుకున్న సమయంలో ఇప్పుడు మళ్లీ హీరోగా మారనున్నాడు. 'లవర్' సినిమా ఫ్లాప్ అయినప్పటికీ, ఆ సినిమాని నిర్మించిన దిల్ రాజు ఈ సినిమాని కూడా నిర్మించనున్నారు.

'ఇద్దరి లోకం ఒకటే' అనే యూత్ ఫుల్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు రాజ్ తరుణ్. జీఆర్ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు సమీర్ రెడ్డి ఈ సినిమాకి కుడా సినిమాటోగ్రఫీ పనులు చేయనున్నారు. పాపులర్ డైలాగ్ రైటర్ అబ్బూరి రవి ఈ సినిమాకి మాటలు అందిస్తున్నారు. ఈ సినిమా లో హీరోయిన్ మరియు ఇతర కాస్ట్ అండ్ క్రూ వివరాలు త్వరలో తెలియనున్నాయి. మరి కనీసం ఏ సినిమాతో అయినా రాజ్ తరుణ్ హిట్ అందుకుంటాడా లేదా చూడాలి.

Ruthvik

Ruthvik

Next Story