Sudheer Raju: రాజ్ తరుణ్ తో సినిమా అందుకే అంటున్న డైరెక్టర్

* ఇద్దరు స్నేహితుల మధ్య యుద్ధం జరిగితే ఎలా ఉంటుందో ఈ సినిమా కథ" అని చెప్పుకొచ్చారు సుధీర్ రాజు.

admin1
Updated on: 10 Oct 2021 2:54 PM IST
Raj Tarun and Sandeep Madhav Ready to do a Movie with Director Sudheer Raju
X

రాజ్ తరుణ్ - సందీప్ మాధవ్ - సుధీర్ రాజు (ఫైల్ ఫోటో) 

Sudheer Raju: యువ నటులు రాజ్ తరుణ్ మరియు సందీప్ మాధవ్ కలిసి ఇప్పుడు ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు దర్శకుడు సుధీర్ రాజు సిహెచ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా గురించి మాట్లాడుతూ "మనం తెలుగులో ఇప్పటికీ స్నేహం మీద చాలానే సినిమాలు చూశాము. కానీ ఈ సినిమాలో ఒక ఆసక్తికరమైన యాంగిల్ ఉంటుంది. ఇద్దరు యువ హీరోలు అయినప్పటికీ వారు వేరే వేరే జనరేషన్స్ వారు. వారి మధ్య స్నేహం ఎలా ఉంటుంది అనేదే ఈ సినిమా. ఇద్దరు స్నేహితుల మధ్య యుద్ధం జరిగితే ఎలా ఉంటుందో ఈ సినిమా కథ" అని చెప్పుకొచ్చారు సుధీర్ రాజు.

ఆసిఫ్ జానీ ఈ సినిమా నిర్మిస్తున్నారు. నిర్మాత కూడా ఈ సినిమా స్క్రిప్ట్ గురించి చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారని సుధీర్ రాజు చెబుతున్నారు. "రాజ్ తరుణ్ కి లవర్ బాయ్ ఇమేజ్ ఉంది. సందీప్ మాధవ్ ఇప్పటికే కొన్ని బయోపిక్ లో నటించాడు. ఇద్దరు కలిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. వారి బాడీ లాంగ్వేజ్ విభిన్నంగా ఉంటాయి. అందుకే హీరోల పాత్రల కోసం వీరిద్దరిని ఎంపిక చేసుకోవడం జరిగింది. అలాగే ఈ సినిమాకి సంగీతాన్ని అందించడం కోసం ముందుకు వచ్చిన మణి శర్మ గారికి కూడా నా కృతజ్ఞతలు," అని అన్నారు సుధీర్ రాజు.

admin1

admin1

Next Story