Fraud Case : డామిట్ కథ అడ్డం తిరిగింది.. రూ.60కోట్ల ఫ్రాడ్ కేసులో బిపాషా బసు, నేహా ధూపియా

Fraud Case : డామిట్ కథ అడ్డం తిరిగింది.. రూ.60కోట్ల ఫ్రాడ్ కేసులో బిపాషా బసు, నేహా ధూపియా
x

Fraud Case : డామిట్ కథ అడ్డం తిరిగింది.. రూ.60కోట్ల ఫ్రాడ్ కేసులో బిపాషా బసు, నేహా ధూపియా

Highlights

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ఇప్పుడు కొత్త చిక్కుల్లో పడ్డారు. 60 కోట్ల రూపాయల ఫ్రాడ్ కేసులో ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) ఆయనను సుమారు ఐదు నుంచి ఆరు గంటల పాటు విచారించింది. ఈ విచారణలో ఆయన సీనియర్ హీరోయిన్లు బిపాషా బసు, నేహా ధూపియా పేర్లను బయటపెట్టారు.

Fraud Case : బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ఇప్పుడు కొత్త చిక్కుల్లో పడ్డారు. 60 కోట్ల రూపాయల ఫ్రాడ్ కేసులో ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) ఆయనను సుమారు ఐదు నుంచి ఆరు గంటల పాటు విచారించింది. ఈ విచారణలో ఆయన సీనియర్ హీరోయిన్లు బిపాషా బసు, నేహా ధూపియా పేర్లను బయటపెట్టారు. ఈ 60 కోట్ల మోసంలో కొంత డబ్బు ఈ ఇద్దరు నటీమణులకు ఫీజుల రూపంలో ఇచ్చామని రాజ్ కుంద్రా చెప్పినట్లు సమాచారం. దీంతో ఇప్పుడు బిపాషా, నేహాకు కూడా చిక్కులు తప్పేలా లేవు.

తనిఖీల్లో వెల్లడైన విషయాలు

ఈ కేసులో ఇప్పటికే తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈవోడబ్ల్యు అధికారులు శిల్పాశెట్టి, బిపాషా బసు, నేహా ధూపియాతో సహా మొత్తం నలుగురు నటీమణుల ఖాతాలకు కంపెనీ ఖాతాల నుండి నేరుగా డబ్బు బదిలీ అయినట్లు కనుగొన్నారు. ఇప్పటివరకు దాదాపు 25 కోట్ల రూపాయల నగదు బదిలీని అధికారులు గుర్తించారు. దీనితో పాటు, బాలాజీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఏదైనా ఆర్థిక లావాదేవీ జరిగిందా అని కూడా పోలీసులు విచారిస్తున్నారు.

నోట్ల రద్దు సమయంలో మోసం

అధికారుల విచారణలో నోట్ల రద్దు సమయంలో కంపెనీ ఆర్థిక లావాదేవీలలో నగదు కొరత ఏర్పడిందని తెలిసింది. ఆ సమయంలో కొంత డబ్బును అనుమానాస్పద ఖాతాలకు బదిలీ చేసినట్లు అధికారులు ఆధారాలు సేకరించారు. ఈ 60 కోట్ల రూపాయల మోసం కేసులో ఇంకా విచారణ కొనసాగుతోంది, రాజ్ కుంద్రాను మళ్లీ విచారించే అవకాశం ఉంది. ఈ కేసులో మరికొన్ని పేర్లు బయటపడే అవకాశం కూడా ఉంది.

అసలు కేసు ఏమిటి?

గత ఆగస్టు నెలలో శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా, మరొకరిపై ఆర్థిక మోసం కేసు నమోదైంది. లోటస్ క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ డైరెక్టర్ అయిన దీపక్ కోఠారి ఈ ఫిర్యాదును దాఖలు చేశారు. 2015 నుంచి 2023 మధ్య కాలంలో ఈ మోసం జరిగిందని ఆయన ఆరోపించారు. తమ వ్యాపారాన్ని విస్తరిస్తామని చెప్పి శిల్పా, రాజ్ కోఠారి నుంచి డబ్బు తీసుకున్నారని, కానీ దానిని వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories