Rahul Ramakrishna: షాకింగ్ నిర్ణయం తీసుకున్న రాహుల్ రామకృష్ణ

Rahul Ramakrishna: అభిమానులకి పెద్ద షాక్ ఇచ్చిన రాహుల్ రామకృష్ణ

admin1
Updated on: 5 Feb 2022 5:00 PM IST
Rahul Ramakrishna Made a Shocking Decision | Tollywood News
X

 షాకింగ్ నిర్ణయం తీసుకున్న రాహుల్ రామకృష్ణ

Rahul Ramakrishna: తెలుగులో లో ఉన్న యువ కామెడియన్ లలో రామకృష్ణ కూడా ఒకరు. షార్ట్ ఫిలిమ్స్ తో పరిచయమైన రాహుల్ రామకృష్ణ "అర్జున్ రెడ్డి" సినిమాలో విజయ్ దేవరకొండ స్నేహితుడి పాత్రలో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ సినిమా తర్వాత రాహుల్ కి చాలా ఆఫర్లు లభించాయి. ఇంటెలిజెంట్, భరత్ అనే నేను, చి ల సౌ, గీతగోవిందం, హుషారు, బ్రోచేవారెవరురా, జాతి రత్నాలు, అల వైకుంఠపురం లో, వంటి చాలా సినిమాల్లో తన నటనతో మరియు కామెడీ తో అందరినీ అలరించారు రాహుల్ రామకృష్ణ. తాజాగా సోషల్ మీడియాలో రాహుల్ రామకృష్ణ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు అభిమానులను షాక్కు గురి చేసింది.

ఇకపై తాను సినిమాలు చేయనని, 2022 తో నటనకు గుడ్బై చెబుతున్నట్లుగా ప్రకటించారు రాహుల్ రామకృష్ణ. "2022 నా ఆఖరి సంవత్సరం. ఈ సంవత్సరం తర్వాత నేను సినిమాలు చేయద్దని నిర్ణయించుకున్నాను. ఎవరు ఏమనుకున్నా కేర్ చేయను" అని కరాఖండిగా ట్వీట్తో తెలిపారు రాహుల్ రామకృష్ణ. ఇది నిజమేనా లేక ఏదైనా సినిమా ప్రమోషనా లేక ప్రాంకా అని కొందరు అడుగుతుండగా, రాహుల్ రామకృష్ణ మాత్రం సినిమాలకి గుడ్ బయ్ చెబుతున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు రాహుల్ రామకృష్ణ "ఆర్ఆర్ఆర్" మరియు "విరాటపర్వం" సినిమాలలో కనిపించనున్నారు.

admin1

admin1

Next Story