MAA Elections: "మా" ఎన్నికలలో రఘుబాబు

MAA Elections: మంచు విష్ణు ప్యానల్ నుంచి జనరల్ సెక్రటరీగా రఘుబాబు

Sandeep Eggoju
Updated on: 18 Sept 2021 2:51 PM IST
Raghubabu as General Secretary From Manchu Vishnu Panel
X

రఘు బాబు (ఫైల్ ఇమేజ్)

MAA Elections: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఎన్నికలపై తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అక్టోబర్‌ 10న జరగనున్న ఈ ఎన్నికల కోసం అధ్యక్ష అభ్యర్థులగా మంచు విష్ణు, ప్రకాశ్‌రాజ్‌ పోటాపోటీగా తలపడుతున్నారు. ఇప్పటికే ప్రకాశ్‌రాజ్‌ తన ప్యానల్‌ని ప్రకటించగా.. తాజాగా విష్ణు ప్యానల్‌ నుంచి కీలక నటుడి పేరు బయటకు వచ్చింది. నటుడు రఘుబాబు ప్రధాన కార్యదర్శి పదవి కోసం విష్ణు ప్యానల్‌ నుంచి పోటీలోకి దిగుతున్నారు. ఈ మేరకు ఆయన జనరల్‌ సెక్రటరీగా విజయం సాధించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. మరోవైపు, జనరల్‌ సెక్రటరీ పదవి కోసం ఇప్పటికే ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ నుంచి జీవిత పోటీ పడతుండగా, బండ్ల గణేశ్‌ స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story