పిచ్చిపిచ్చిగా ఉందా?.. సుడిగాలి సుధీర్‌ ఫ్యాన్స్‌పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఆగ్రహం

Raghavendra Rao Serious On Sudigali Sudheer Fans
x

పిచ్చి పిచ్చిగా ఉందా.. సుడిగాలి సుధీర్‌ ఫ్యాన్స్‌పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఆగ్రహం

Highlights

సుడిగాలి సుధీర్‌ అభిమానులపై మండిపడిన రాఘవేంద్రరావు

Wanted PanduGod: సునీల్, అనసూయ భరద్వాజ్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సప్తగిరి, శ్రీనివాస్‌ రెడ్డి, సుడిగాలి సుధీర్‌ ప్రధాన పాత్రలలో నటించిన సినిమా "వాంటెడ్ పండుగాడు". త్వరలోనే విడుదల కాబోతున్న ఈ సినిమాకి శ్రీధర్ సీపాన దర్శకత్వం వహించారు. సాయిబాబా కోవెలమూడి మరియు వెంకట్ కోవెలమూడి నిర్మించిన ఈ సినిమాని స్వయంగా కే రాఘవేంద్రరావు సమర్పించారు.

ఈ సినిమా ఈనెల 19న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాదులో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు దర్శకనిర్మాతలు. ఈవెంట్ లో భాగంగా అనసూయ స్టేజ్ మీద మాట్లాడుతూ ఉండగా సుడిగాలి సుదీర్ కూడా స్టేజి మీదకి వచ్చారు. దీంతో సుధీర్ అభిమానులు అరుపులు కేకలతో సుధీర్ కి స్వాగతం చెప్పారు.

అప్పుడు రాఘవేంద్రరావు మైక్ తీసుకుని వారిని సైలెంట్ గా ఉండమని కోరుకున్నారు కానీ సుధీర్ అభిమానులు మాత్రం ఇంకా అరుపులు ఆపకపోవడంతో రాఘవేంద్రరావు వారిపై అరిచారు. "పిచ్చిపిచ్చిగా ఉందా? ఎవరు పిలిచారు అసలు వీళ్లని? పెద్దా చిన్నా తేడా లేదా? ఇలాగే అరిస్తే బయటకు పంపించేస్తాను," అంటూ రాఘవేంద్రరావు సుడిగాలి సుదీర్ ఫ్యాన్స్ పై నిప్పులు చెరిగారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories