Raghavendra Rao: రామాయణం మీద సినిమా తీయాలనుకుంటున్న రాఘవేంద్ర రావు

* మరొక మైథలోజికల్ సినిమాతో సిద్ధమవుతున్న రాఘవేంద్రరావు

admin1
Updated on: 1 Nov 2021 2:45 PM IST
Raghavendra Rao Planning to Make Ramayana Movie
X

రాఘవేంద్ర రావు(ఫైల్ ఫోటో)

Raghavendra Rao: దర్శకేంద్రుడు గా ఇప్పటికే బోలెడు బ్లాక్ బస్టర్ చిత్రాలని మన అందించిన రాఘవేంద్రరావు పౌరాణిక సినిమాలను కూడా తీశారు. అన్నమయ్య, శ్రీ రామ దాసు వంటి సూపర్ హిట్ సినిమాలు మనకి అందించిన రాఘవేంద్ర రావు "ఓం నమో వెంకటేశాయ" సినిమా తర్వాత కొంత కాలం ఇండస్ట్రీకి దూరం అయ్యారు. తాజాగా ఈ మధ్యనే శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వచ్చిన "పెళ్లి సందడి" సినిమాతో మళ్లీ అందరి దృష్టిని ఆకర్షించారు రాఘవేంద్రరావు. రాఘవేంద్ర రావు హీరోగా తనికెళ్ల భరణి దర్శకత్వంలో ఒక సినిమా కూడా చేయబోతున్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం రాఘవేంద్ర రావు ఇప్పుడు ఒక పౌరాణిక తో సినిమా తీయాలని అనుకుంటున్నారట. హిందూ ఎపిక్ రామాయణం మీద రాఘవేంద్రరావు ఒక సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నారు. రాక్ లైన్ వెంకటేష్ ఈ సినిమా నిర్మించడానికి సిద్ధమయ్యారు. అయితే మిగతా పౌరాణిక సినిమాలతో పోలిస్తే ఈ సినిమా చాలా విభిన్నంగా ఉండబోతోందని తెలుస్తోంది. మరోవైపు ప్రభాస్ కూడా రామాయణం మీద "ఆదిపురుష్" అనే సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా కంటే కూడా ఈ సినిమా డిఫరెంట్ గా ఉండబోతోందట. ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

admin1

admin1

Next Story