Bheems Ceciroleo: చిరంజీవి సినిమాకు భీమ్స్ మ్యూజిక్.. లీక్ చేసిన రాఘవేంద్రరావు

Raghavendra Rao leaked Bheems music for Chiranjeevis movie
x

చిరంజీవి సినిమాకు భీమ్స్ మ్యూజిక్.. లీక్ చేసిన రాఘవేంద్రరావు

Highlights

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేరు భీమ్స్ సిసిరోలియో. ఇటీవల విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మరోసారి భీమ్స్ పేరు మారుమోగింది.

Bheems Ceciroleo: టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేరు భీమ్స్ సిసిరోలియో. ఇటీవల విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మరోసారి భీమ్స్ పేరు మారుమోగింది. గోదావరి గట్టు మీద, బ్లాక్ బస్టర్ పొంగలు, మీను సాంగ్ ఇలా సినిమాలోని ప్రతి పాట బాగా హిట్ అయ్యాయి. సంక్రాంతికి వస్తున్నాం హిట్‌లో హైలెట్‌గా నిలిచాయి. అయితే ఇప్పుడు భీమ్స్ మెగా ఛాన్స్ కొట్టేశారు. చిరంజీవి నెక్ట్ సినిమాకు భీమ్స్ మ్యూజిక్ అందించబోతున్నారు.

ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం మూవీ వేడుకల్లో దర్శకుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. భీమ్స్ మ్యూజిక్ సినిమాకు బాగా హెల్ప్ అయిందన్నారు. అంతేకాదు అనిల్ రావిపూడి, చిరంజీవితో చేయబోయే నెక్ట్ సినిమాకు భీమ్స్ మ్యూజిక్ అందించబోతున్నట్టు లీక్ చేశారు. చిరంజీవి సినిమాకు సంక్రాంతి అల్లుడు పెట్టాలంటూ సూచించారు. మొన్నటివరకు చిన్న హీరోల సినిమాలకు మ్యూజిక్ అందించిన భీమ్స్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా అందించిన సక్సెస్‌తో మెగాస్టార్ లాంటి స్టార్ హీరోల సినిమాలు చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు.

తక్కువ కాలంలో, తక్కువ బడ్జెట్‌తో రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి కానుకగా వచ్చి సక్సెస్ సాధించింది. ఈ సినిమా దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది. ఈ సినిమాకు హిట్‌లో భీమ్స్ మ్యూజిక్ హైలెట్‌గా నిలిచిందని చెప్పుకోవచ్చు.

2003లో వచ్చిన ఆయుధం సినిమా కోసం ఒయ్ రాజు కళ్లల్లో నీవే.. ఒయ్ రాజు గుండెల్లో నీవే పాటతో పాటల రచయితగా తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టారు భీమ్స్ సిసిరోలియో. 2011లో సీమ టపాకాయ్ సినిమాలో ధీరే ధీరే దిల్లే పాటలను రాశారు. 2012లో వచ్చిన నువ్వా నేనా సినిమాకు తొలిసారిగా సంగీతం అందించారు. ధమాక, బలగం, డీజే టిల్లుకు సీక్వెల్‌గా వచ్చిన టిల్లు స్క్వేర్ వంటి సినిమాలు భీమ్స్‌కు బాగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇప్పుడు ఏకంగా తమన్, దేవిశ్రీ వంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ల తర్వాత భీమ్స్ సిసిరోలియో పేరు వినిపించే స్థాయికి ఎదిగారు.

Show Full Article
Print Article
Next Story
More Stories