భయపెడుతున్న 'కాంచన 3' ట్రైలర్

ఇప్పటికే 'ముని, 'కాంచన', 'కాంచన 2 (గంగ)' సినిమాలతో ప్రేక్షకులను భయపెట్టడమే కాక బాగా అలరించిన రాఘవ లారెన్స్...
ఇప్పటికే 'ముని, 'కాంచన', 'కాంచన 2 (గంగ)' సినిమాలతో ప్రేక్షకులను భయపెట్టడమే కాక బాగా అలరించిన రాఘవ లారెన్స్ ఇప్పుడు అదే సిరీస్ లోని నాలుగవ ఇన్స్టాల్మెంట్ అయిన 'కాంచన 3' సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. హారర్ కామెడీ జానర్లో తెరకెక్కనున్న ఈ చిత్రం లో వేదిక, నిక్కీ తంబోలి' మరియు బిగ్ బాస్ ఫేమ్ ఓవియ లు హీరోయిన్లుగా నటించారు. ముందు చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా కచ్చితంగా సరికొత్తగా ఉండబోతోందని చిత్ర బృందం ఇప్పటికి చాలాసార్లు చెప్పింది.
ఇక తాజాగా చిత్ర ప్రమోషన్స్ ను మొదలు పెట్టిన దర్శకనిర్మాతలు ఇవాళ ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. కేవలం ఒకటిన్నర నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోకి ఇప్పుడు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. హారర్ కామెడీ అయినప్పటికీ ఈ చిత్ర ట్రైలర్ చూస్తే ఎక్కువ హారర్ సన్నివేశాలే కనిపిస్తాయి. దీన్నిబట్టి ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను మరింతగా భయపడుతుందని తెలుస్తోంది. ముఖ్యంగా రాఘవ లారెన్స్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకే హైలైట్గా మారబోతోందని చెప్పుకోవచ్చు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రానికి అమ్రేష్ గణేష్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం ఏప్రిల్ 19న విడుదల కానుంది.
యుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMTKodali Nani: పిల్లలను రెచ్చగొట్టి పవన్ పబ్బం గడుపుతున్నారు
26 May 2022 10:20 AM GMTGangula Kamalakar: బండి తన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
26 May 2022 10:07 AM GMTCM KCR: మాజీ ప్రదాని దేవెగౌడ నివాసానికి సీఎం కేసీఆర్
26 May 2022 9:08 AM GMTటీజీ వెంకటేష్‌కు రాజ్యసభ? రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరికి ఛాన్స్..
26 May 2022 8:56 AM GMTNarendra Modi: ఒక కుటుంబ పాలన కోసం తెలంగాణలో బలిదానాలు జరగలేదు
26 May 2022 8:44 AM GMTకోలి జాతి శునకంలా మారిన జపాన్ వ్యక్తి.. అందుకు రూ.12 లక్షల వ్యయం
26 May 2022 5:44 AM GMT
Karan Johar: కరణ్ జోహార్ పార్టీలో కానరాని టాలీవుడ్ సెలబ్రిటీలు
26 May 2022 4:00 PM GMTPersonal Loan: స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. లక్ష రూపాయల వరకు రుణ...
26 May 2022 3:30 PM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTClove Oil: లవంగం నూనెతో పురుషులకి బోలెడు లభాలు.. తెలిస్తే షాక్...
26 May 2022 2:30 PM GMTసల్మాన్ ఖాన్ రీమేక్ సినిమాకి నో చెప్పిన తరుణ్ భాస్కర్
26 May 2022 1:30 PM GMT