ఆ రోజే రాబోతున్న కాంచన 3

ఆ రోజే రాబోతున్న కాంచన 3
x
Highlights

ఇప్పటికే 'ముని', 'కాంచన', 'కాంచన 2 (గంగ)' సినిమాలతో భయపెట్టిన రాఘవ లారెన్స్ ఇప్పుడు మళ్ళీ అదే సిరీస్ లోని మరొక భాగంగా తెరకెక్కనున్న 'కాంచన 3' సినిమాతో...

ఇప్పటికే 'ముని', 'కాంచన', 'కాంచన 2 (గంగ)' సినిమాలతో భయపెట్టిన రాఘవ లారెన్స్ ఇప్పుడు మళ్ళీ అదే సిరీస్ లోని మరొక భాగంగా తెరకెక్కనున్న 'కాంచన 3' సినిమాతో ప్రేక్షకులను మరింత భయపెట్టడానికి సిద్ధమవుతున్నాడు. బిగ్ బాస్ ఫేమ్ ఓవియ, వేదిక ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. నిఖిల్ తంబోలి, సూరి, జనని, బాలసుబ్రమణ్యం ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా కు రాఘవ లారెన్స్ దర్శకత్వం కూడా వహించారు. తెలుగు తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి.

ఇప్పటిదాకా ఈ సిరీస్ లో విడుదలైన సినిమాలు హిట్ అవ్వడం వల్ల ఈ చిత్రం కూడా కచ్చితంగా హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు దర్శక నిర్మాతలు. ఈ సినిమా ఏప్రిల్ 19 వ తారీకున తెలుగు మరియు తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి డూపాడూ సంగీతాన్ని అందిస్తున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories