Raghava Lawrence: మంచి మనసు చాటుకున్న లారెన్స్.. కలియుగ కర్ణుడు అంటున్న నెటిజన్స్

Raghava Lawrence: మంచి మనసు చాటుకున్న లారెన్స్.. కలియుగ కర్ణుడు అంటున్న నెటిజన్స్
x

Raghava Lawrence: మంచి మనసు చాటుకున్న లారెన్స్.. కలియుగ కర్ణుడు అంటున్న నెటిజన్స్

Highlights

Raghava Lawrence: కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు, ఫిలాంత్రఫిస్ట్ గా రాఘవ లారెన్స్ పేరు ప్రత్యేకమైనది.

Raghava Lawrence: కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు, ఫిలాంత్రఫిస్ట్ గా రాఘవ లారెన్స్ పేరు ప్రత్యేకమైనది. సినిమాల్లో తనదైన డ్యాన్స్ మూమెంట్స్‌తో ఇండస్ట్రీని ఊపేసిన లారెన్స్, స్టార్ హీరోలందరికీ స్టెప్పులు చెప్పించిన మాస్టర్. కెరీర్ ప్రారంభంలో చిన్న పాత్రలతో మొదలుపెట్టి, హీరోగా తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్నాడు. జిగర్తాండ డబుల్ ఎక్స్, చంద్రముఖి 2, రుద్రన్ సినిమాలతో ఇటీవలి కాలంలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, లారెన్స్ సామాజిక సేవలో మాత్రం ఎప్పుడూ ముందుంటాడు. తన లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేదలకూ, చిన్నారులకూ, విద్యార్థులకూ ఎన్నో సహాయాలు అందించాడు. పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చిన సందర్భాలూ ఉన్నాయి.

తాజాగా మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు లారెన్స్. ముగ్గురు చిన్నారులు తమ తల్లి ఆరోగ్య సమస్యతో బాధపడుతుండటాన్ని తెలియజేస్తూ ప్రభుత్వాన్ని సాయం చేయాలని విజ్ఞప్తి చేస్తూ చేసిన వీడియో, సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియో చూసిన లారెన్స్ వెంటనే స్పందించాడు.

తాను ఆ వీడియో తన వరకు షేర్ చేసిన వారికి ధన్యవాదాలు తెలుపుతూ… “మీరు ప్రభుత్వాన్ని కోరిన సాయం త్వరలోనే అందుతుంది. నా వంతుగా కూడా మీకు నేను తప్పకుండా సహాయపడతాను. నా టీమ్ ఈరోజే మిమ్మల్ని కలుస్తుంది” అని లారెన్స్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ లారెన్స్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “కలియుగ కర్ణుడు” అంటూ కామెంట్స్ పెట్టి లారెన్స్ గొప్పదనాన్ని కొనియాడుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories