ఆ రెండు సినిమాలను మించి.. రాధే శ్యామ్ మొదటిరోజు కలెక్షన్లు ఎంతంటే..

Radheshyam Breaks Bheemla Nayak and Pushpa Opening Day Records
x

ఆ రెండు సినిమాలను మించి.. రాధే శ్యామ్ మొదటిరోజు కలెక్షన్లు ఎంతంటే..

Highlights

Movie Collections: కరోనా కారణంగా వాయిదా పడ్డ సినిమాలు అన్నీ ఒకదాని తర్వాత మరొకటి థియేటర్లలో విడుదల కి సిద్ధమవుతున్నాయి.

Movie Collections: కరోనా కారణంగా వాయిదా పడ్డ సినిమాలు అన్నీ ఒకదాని తర్వాత మరొకటి థియేటర్లలో విడుదల కి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద పలు పెద్ద సినిమాలు భారీ విజయాన్ని సాధించాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "భీమ్లా నాయక్" సినిమా ఈ మధ్యనే విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. విడుదలైన మొదటి రోజు సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 37.3 కోట్ల తో అందరి దృష్టిని ఆకర్షించింది. గతంలో 34.8 కోట్ల తో "పుష్ప" సినిమా రికార్డు సృష్టించగా, ఈ రికార్డుని బ్రేక్ చేసింది "భీమ్లా నాయక్". ఇక తాజాగా విడుదలైన "రాధేశ్యామ్" సినిమా ఈ రెండు సినిమాల రికార్డులను బ్రేక్ చేసింది.

ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన "రాధే శ్యామ్" సినిమా మార్చి 11 2022 న భారీ అంచనాల మధ్యన విడుదల అయ్యింది. మొదటి రోజు నుండి ఈ సినిమా మంచి టాక్ మరియు ఓపెనింగ్స్ తో బాక్సాఫీస్ వద్ద తన ఖాతా ని ఓపెన్ చేసింది. ఇక ఈ సినిమా మొదటి రోజున 55 కోట్లు వసూలు చేసి "భీమ్లా నాయక్"ను రెండవ స్థానానికి తోసేసి మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ఈ సినిమాలో ప్రభాస్ ఒక ప్రముఖ హస్తసాముద్రికుడి పాత్రలో కనిపించారు. ఇక ఈ సినిమా హిందీలో రూ.5 కోట్లని వసూలు చేసిందని, ఓవర్సీస్ లో మొదటి రోజునే 1 మిలియన్ మార్క్ దాటిందని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories