Radhe Shyam: దీపావళి కానుక ఇవ్వబోతున్న "రాధేశ్యామ్" దర్శక నిర్మాతలు

Radhe Shyam: "రాధేశ్యామ్" టీజర్ రిలీజ్ చేయబోతున్న చిత్రబృందం

admin1
Updated on: 26 Oct 2021 5:30 PM IST
Radhe Shyam Film Unit Plans to Release the Teaser to This Diwali
X

దీపావళి కనుక ఇవ్వనున్న రాధే శ్యామ్ చిత్ర బృందం (ఫైల్ ఇమేజ్)

Radhe Shyam: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు అందరూ ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా "రాధే శ్యామ్". ఎప్పుడో 2019 లో "సాహో" సినిమా తో బ్లాక్ బస్టర్ ఇచ్చిన ప్రభాస్ ఆ తర్వాత వెండితెరపై మెరవనేలేదు. అందుకే అభిమానులు అందరూ "రాధే శ్యామ్" సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ అంచనాలను పెంచుకుంటున్నారు. అయినా సరే సినిమా అన్ని అంచనాలను దాటే విధంగానే ఉంటుందని చిత్ర బృందం విశ్వసిస్తున్నారు. "జిల్" ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

ఒకవైపు "రాధేశ్యామ్" విడుదల విషయంలో మాత్రం వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తున్నారు. కనీసం సినిమాకి సంబంధించిన అప్డేట్లను అయినా విడుదల చేయచ్చుగా అని అభిమానులు నిరాశ పడ్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శక నిర్మాతలు దీపావళి సందర్భంగా నవంబర్ 4న సినిమాకి సంబంధించి ఒక మంచి టీజర్ ను విడుదల చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఈ టీజర్ కట్ కోసం బిజీగా ఉంది చిత్ర బృందం. యు.వి.క్రియేషన్స్ మరియు టి సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా లో కృష్ణంరాజు, సచిన్ ఖేడేకర్, భాగ్యశ్రీ, తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

admin1

admin1

Next Story