Radhe Shyam: ఆగిన 'రాధేశ్యామ్' షూటింగ్... కారణం ఇదే..!

Radhe Shyam: కరోనా సెకండ వేవ్ కేసులు రోజు రోజుకూ మరింత పెరుగుతున్నాయి.

Venkata Chari
Published on: 21 April 2021 8:08 PM IST
Radhe Shyam Shooting Stopped Due to Covid-19
X

రాధేశ్యామ్ లో ప్రభాస్ (ఫొటో ట్విట్టర్)

Radhe Shyam: కరోనా సెకండ వేవ్ కేసులు రోజు రోజుకూ మరింత పెరుగుతున్నాయి. దీంతో సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు కరోనా బారిన పడుతున్నారు. కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో ప్రస్తుతం సినిమా షూటింగ్‌లన్నీ వాయిదా పడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'రాధేశ్యామ్' సినిమా కూడా చేరింది.

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ ఐసోలేషన్‌లో ఉన్నాడని వార్తలు వెలువడుతున్నాయి. హోమ్‌ క్వారంటైన్‌‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత మేకప్ ఆర్టిస్ట్‌కు కరోనా పాజిటివ్ గా తేలడంతో.. ముందు జాగ్రత్తగా ప్రభాస్‌కు కూడా ఐసోలేషన్‌లోకి వెళ్లాడంట. ఆయనతోపాటు మొత్తం రాధేశ్యామ్‌ చిత్రయూనిట్‌ కూడా సెల్ప్‌ ఐసోలేషన్‌లోకి వెళ్లినట్లు టాక్ వినిపిస్తోంది.

కాగా ప్రభాస్‌ పలు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. రాధేశ్యామ్‌ చిత్రం చివరి షెడ్యూల్‌ మాత్రమే మిగిలుంది. ఇందులో భాగంగా ఓ పాటతోపాటు కొన్ని సీన్లు మాత్రమే షూట్‌ చేయాల్సి ఉంది. అనంతరం ఆదిపురుష్‌, సలార్‌ సినిమాల్లో నటించనున్నాడు.

Venkata Chari

Venkata Chari

Next Story