Radhe Shyam: 'రాధే శ్యామ్' నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్

Radhe Shyam: మహా శివరాత్రి సందర్భంగా ప్రభాస్ హీరోగా నటిస్తోన్న'రాధే శ్యామ్' నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

Kranthi
Updated on: 11 March 2021 11:39 AM IST
Tollywood: Special poster release from
X

రాధే శ్యామ్ పోస్టర్ 


Radhe Shyam: రెబల్ స్టార్ ఫ్యాన్స్ నటిస్తోన్న సినిమా 'రాధే శ్యామ్'. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందితున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వుంది. 1960 దశకం నాటి వింటేజ్‌ ప్రేమకథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. పాన్ ఇండియా సినిమాగా ఐదు భాషల్లో ఈ మూవీ రానున్న నేపథ్యంలో అన్ని భాషల్లో ఈ పోస్టర్ రిలీజ్ చేశారు. జులై 30వ తేదీన భారీ ఎత్తున్న ఈ మూవీ రిలీజ్ చేయబోతున్నారు. కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై రూపొందుతున్న ఈ భారీ సినిమాలో భాగ్య శ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, మురళీ శర్మ, కునాల్ రాయ్ కపూర్, ఎయిర్‌టెల్‌ భామ శాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

అదే రేంజ్‌లో చిత్ర ప్రమోషన్స్ చేయాలని ఆలోచిస్తోంది చిత్రయూనిట్.. తాజాగా ప్రేక్షకులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్, పూజా హెగ్డే మంచులో వ్యతిరేక దిశల్లో పడుకుని ఆకాశం వైపు చూస్తూ రొమాంటిక్ మూడ్‌లో కనిపిస్తున్న ఈ పోస్టర్ చాలా డిఫరెంట్‌గా అందరినీ ఆకర్షిస్తోంది. ఇందులో ప్రభాస్ ప్యూర్ రొమాంటిక్ రోల్‌‌లో కనిపించబోతుండటం విశేషం. ఏదేమైనా వింటేజ్‌ ప్రేమకథా చిత్రంపై జనాల్లో మాత్రం ఓ రేంజ్ అంచనాలున్నాయి.


Kranthi

Kranthi

Next Story