Radhe Shyam Movie Update: "రాధేశ్యామ్" అప్డేట్ అప్పుడే అంటున్న చిత్రబృందం

*మరొక అప్డేట్ ఇవ్వనున్న "రాధేశ్యామ్" యూనిట్

admin1
Updated on: 20 Nov 2021 6:00 PM IST
Radhe Shyam Movie Team Planning to Release Movie Promo or Song Promo Soon
X

"రాధేశ్యామ్" అప్డేట్ అపుడే అంటున్న చిత్రబృందం

Radhe Shyam Movie Update: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా స్టార్ బ్యూటీ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సినిమా "రాధేశ్యామ్". రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఒక అద్భుతమైన ఫ్యాంటసీ ప్రేమ కథ గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భారీ అంచనాలు మధ్య ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా 14 జనవరి న విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమా 1911లో ఇటలీలో 104 మంది ప్యాసింజర్ లతో ఉన్నట్టుండి మాయమైపోయిన జనెట్టీ ఒక అనే ఘోస్ట్ ట్రైన్ ఆధారంగా కథ ఉంటుందని సమాచారం.

తాజా సమాచారం ప్రకారం ఈనెల 23న చిత్రబృందం అభిమానులకి ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతోందట. నవంబర్ 23న సినిమా నుంచి మరొక పాట లేదా ఈ సినిమా ప్రోమోని విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. ఎప్పటి నుండో సినిమా అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది తీయ్యటి వార్త. ప్రభాస్ ఈమధ్యే ఈ సినిమా డబ్బింగ్ పనులను మొదలుపెట్టారట. టి సిరీస్ మరియు యు.వి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న "రాధేశ్యామ్" సినిమాలో కృష్ణంరాజు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

admin1

admin1

Next Story