ఇటలీలో ఇబ్బందులుపడుతున్న డార్లింగ్ ప్రభాస్

Arun Chilukuri
Published on: 31 Oct 2020 12:50 PM IST
ఇటలీలో ఇబ్బందులుపడుతున్న డార్లింగ్ ప్రభాస్
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటలీలో ఇరుక్కపొయారు. బయటకు రాలేని స్విచ్‌వేషన్, షూటింగ్ చేయలని పరిస్థితి. ఏం చేయాలో తోచక రాధేశ్యామ్ చిత్రయూనిట్ తలలు పట్టుకుంటోంది. రోజుకు కనీసం కొన్ని గంటలు కూడా సెట్స్ లో ఉండలేకపోతున్నారట. ఇటలీలో రాధేశ్యామ్ సినిమా షూటింగ్‌ ఎందుకు నత్తనడకన సాగుతుంది. అసలు అక్కడ ఏం జరుగుతోంది ?

ప్రస్తుతం ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్‌లో వస్తున్న రాధేశ్యామ్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే కరోనా కారణంగా లేటైనా ఈ సినిమా షూటింగ్ రీసెంట్‌గా ఇటలీలో మళ్లీ మొదలైంది. ఇటలీ దేశంలో కరోనా ఇంకా విజృంభిస్తూనే ఉంది. అయినా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ కొనసాగిస్తున్నారు. కానీ ఇప్పుడు ఇటలీలో కరోనా రక్కసి కరళానృత్యం చేస్తోంది. దీంతో రాధేశ్యామ్ షూటింగ్ కు ప్యాకప్ చెప్పకతప్పడం లేదు.

ఇటలీలో కరోనా రెండో దశ విజృంభణ మొదలుపెట్టింది. కరోనాను కంట్రోల్‌ చేసేందుకు అక్కడి ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. దీంతో రాధేశ్యామ్ చిత్రయూనిట్‌కు బ్రేక్‌ చెప్పాల్సి వస్తోంది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసుకొని ఇండియాకు వచ్చేయాలని చిత్రయూనిట్ భావిస్తోంది. ఇక నితిన్ కూడా రంగ్‌దే సినిమా షూటింగ్‌ను ఇటలీలో ప్లాన్ చేసుకున్నాడు. కానీ అక్కడి స్విచ్‌వేషన్స్‌ను అబ్జర్వ్ చేసిన నితిన్ ఇండియాలోనే షూటింగ్ చేయాలని డిసైడయ్యాడు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story