ప్రభాస్ కోసం స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసిన "రాధే శ్యామ్" బృందం

*"రాధే శ్యామ్" సినిమా విషయంలో కాన్ఫిడెంట్ గా ఉన్న ప్రభాస్

admin1
Updated on: 11 Nov 2021 5:00 PM IST
Radhe Shyam Movie Team Arranged Special Screening For Prabhas Radhe Shyam Movie
X

ప్రభాస్ కోసం స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసిన "రాధే శ్యామ్" బృందం

Radhe Shyam Movie: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న "రాధే శ్యామ్" సినిమా పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఫాంటసీ ప్రేమకథాచిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా లో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా 14 జనవరి న విడుదల కాబోతోంది. తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ కోసం చిత్ర దర్శకనిర్మాతలు స్పెషల్ స్క్రీనింగ్ ని ఏర్పాటు చేశారట. సినిమా చూసిన ప్రభాస్ చాలా సంతోషించారట.

ప్రభాస్ సినిమా అవుట్ పుట్ విషయంలో చాలా సంతోషంగా ఉన్నారని సినిమా చూశాక ఆయనకు సినిమా పై ఉన్న కాన్ఫిడెన్స్ మరింత పెరిగిందని తెలుస్తోంది. చాలా కాలం తర్వాత ప్రభాస్ నటిస్తున్న ప్రేమకథ ఇది. అందుకే ఈ సినిమా కోసం అభిమానులకు భారీ అంచనాలు నెలొన్నాయి. టి సిరీస్ మరియు యు.వి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా లో కృష్ణంరాజు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

admin1

admin1

Next Story