Radhe Shyam Promotions: ఆ తర్వాతే "రాధేశ్యామ్" ప్రమోషన్లు చేద్దామని అనుకుంటున్న ప్రభాస్

Radhe Shyam Promotions: అందుకే "రాధేశ్యామ్" ప్రమోషన్లు జరగటం లేదా?

admin1
Updated on: 31 Dec 2021 10:00 PM IST
Radhe Shyam Movie Promotions After Releasing RRR Movie | Tollywood News
X

ఆ తర్వాతే "రాధేశ్యామ్" ప్రమోషన్లు చేద్దామని అనుకుంటున్న ప్రభాస్

Radhe Shyam Promotions: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా "రాధేశ్యామ్". పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఒక ఫాంటసీ ప్రేమకథగా వచ్చే ఏడాది జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్యాన్ ఇండియన్ సినిమాగా విడుదల కాబోతున్న ఈ చిత్రం ప్రమోషన్ల విషయం లో మాత్రం వెనుకంజలో ఉంది. ఒకవైపు జనవరి 7న విడుదల కాబోతున్న "ఆర్ఆర్ఆర్" చిత్ర ప్రమోషన్లు జోరుగా కొనసాగుతుంటే చిత్రబృందం మాత్రం ప్రమోషనల్ ఈవెంట్ తో కూడా ప్రేక్షకుల ముందుకు రాకపోవటం అందరినీ షాక్ కి గురి చేస్తోంది.

అయితే ఎలాగో "ఆర్ ఆర్ ఆర్" సినిమా ముందు విడుదల అవుతుంది కాబట్టి ఇప్పుడు "రాధేశ్యామ్" సినిమాని ప్రమోట్ చేసినా అంతగా ఉపయోగం ఉండదని దర్శకనిర్మాతలు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. మరో వైపు ప్రభాస్ ఇతర కమిట్మెంట్ లతో బిజీగా ఉన్నాడు. "ఆర్ ఆర్ ఆర్" సినిమా విడుదలైన తర్వాత జనవరి 7 నుంచి చిత్ర ప్రమోషన్స్ ను మొదలుపెట్టాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోందట. మరి ఈ వారం రోజుల్లో చిత్ర ప్రమోషన్స్ బాగానే జరుగుతాయో లేదో ఇంకా తెలియాల్సి ఉంది. సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య అనే ఒక ప్రముఖ హస్తసాముద్రికుడి పాత్రలో కనిపించబోతున్నారు.

admin1

admin1

Next Story