రాధే శ్యామ్ ఐదు రోజుల కలెక్షన్లు

Radhe Shyam Movie Five Days Collections | TS News Today
x

గత పదేళ్లలో మొదటి డిజాస్టర్ ను అందుకున్న ప్రభాస్

Highlights

రాధే శ్యామ్ ఐదు రోజుల కలెక్షన్లు

Radhe Shyam: బాహుబలి సినిమా తో ప్రభాస్ ప్యాన్ ఇండియన్ స్టార్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. తెలుగులో మాత్రమే కాక మిగతా భాషల్లో కూడా ప్రభాస్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. సాహో సినిమా హిందీలో బ్లాక్ బస్టర్ గా మారిన సంగతి తెలిసిందే. కానీ తాజాగా ప్రభాస్ హీరోగా నటించిన "రాధేశ్యామ్" సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా మార్చ్ 11న థియేటర్లలో విడుదలైంది. విడుదలైన మొదటి రోజు నుంచి మిక్స్డ్ టాక్ ను అందుకుంటున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా డిజాస్టర్ గా మారింది. గత పదేళ్లలో ప్రభాస్ కరియర్ లో మొట్టమొదటి డిజాస్టర్ గా మారింది ఈ సినిమా.

2010లో ప్రభాస్ హీరోగా నటించిన డార్లింగ్ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ ఏకంగా 140 కోట్లకు అమ్ముడయ్యాయి. కానీ ఈ సినిమా కలెక్షన్లు మాత్రం దాని దరిదాపుల్లోకి కూడా లేవు. తమిళనాడు లో మొదటి వారాంతంలో ఈ చిత్రం 1.5 కోట్లు వసూలు చేయగా కేరళలో కేవలం 35 లక్షలు మాత్రమే వసూలు చేసింది. హిందీలో కూడా అ మొదటి వారాంతంలో కేవలం 15 కోట్లు మాత్రమే వసూలు చేసిన రాధేశ్యామ్ సాహో మొదటి రోజు కలెక్షన్ లలో 60 శాతం కూడా నమోదు చేసుకోలేకపోయింది. తెలుగులో కూడా ఈ చిత్రం డిజాస్టర్ గా మారింది. ఈ నేపథ్యంలో 2010 నుంచి చూసుకుంటే ప్రభాస్ కెరియర్ లో రాధేశ్యామ్ సినిమా మొట్టమొదటి డిజాస్టర్ గా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories