నెగటివ్ కామెంట్లను దగ్గరకి రానివ్వని "రాధే శ్యామ్" డైరెక్టర్...

Radha Krishna: "జిల్" సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమైన రాధాకృష్ణ...

Shireesha
Updated on: 24 May 2022 4:00 PM IST
Radhe Shyam Movie Director Radha Krishna Away from Negative Comments | Live News Today
X

నెగటివ్ కామెంట్లను దగ్గరకి రానివ్వని "రాధే శ్యామ్" డైరెక్టర్...

Radha Krishna: "జిల్" సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమైన రాధాకృష్ణ మొదటి సినిమాతో పర్వాలేదనిపించాడు కానీ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సినిమా చేసే అవకాశాన్ని కొట్టేసాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ వారు నిర్మించిన సినిమా "రాధే శ్యామ్". సినిమా సెట్స్ పైకి వెళ్ళినప్పటినుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా కాలం తర్వాత ప్రభాస్ నటించిన ప్రేమ కథ చిత్రం కావడంతో ఈ సినిమా కోసం అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశారు.

విడుదలకు ముందు వరకు సినిమాపై ఉన్న బజ్ అంతా ఇంతా కాదు. కానీ విడుదల అయినా మొదటి రోజు నుంచి నెగిటివ్ రివ్యూస్ ని అందుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. చాలాకాలం తర్వాత ప్రభాస్ కరిర్లో ఒక మర్చిపోలేని డిజాస్టర్ గా మారింది ఈ సినిమా. సినిమా విడుదల సమయంలో రాధాకృష్ణ సోషల్ మీడియాలో చాలా హడావిడిగా కనిపించాడు కానీ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత అతనిపై నెగిటివిటీ ఎక్కువవడంతో సోషల్ మీడియా కి దూరంగా ఉంటున్నాడు.

తానేమైనా పోస్ట్ పెట్టినా సరే ఎవరు కామెంట్ చేయడానికి లేకుండా ప్రైవసీ చేసుకున్నాడు డైరెక్టర్. ఎవరు కూడా నెగిటివ్ కామెంట్లు చేయకూడదని రాధాకృష్ణ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం రాధాకృష్ణ స్టార్ హీరోల వద్దకు కాకుండా మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

Shireesha

Shireesha

Next Story