Radhe Shyam: ప్రభాస్ "రాధేశ్యామ్" రన్ టైం ఎంతో తెలుసా?

Radhe Shyam: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "రాధేశ్యామ్"...

admin1
Published on: 9 Jan 2022 12:06 PM IST
Radhe Shyam Movie Completed Sensor Certification and Runtime of Radhe Shyam Movie | Tollywood News
X

Radhe Shyam: ప్రభాస్ "రాధేశ్యామ్" రన్ టైం ఎంతో తెలుసా?

Radhe Shyam: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "రాధేశ్యామ్". రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. నిజానికి ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల కావాల్సి ఉంది. కానీ పెరుగుతున్న కరోనా కేసు లను దృష్టిలో పెట్టుకుని దర్శక నిర్మాతలు సినిమా విడుదలను వాయిదా వేశారు.

ఇప్పటికీ పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ కూడా అమలు చేయగా, చిత్రబృందం సంక్రాంతి బరిలో నుండి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమా సెన్సార్ సర్టిఫికేషన్ పూర్తిచేసుకుంది. భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న "రాధేశ్యామ్" సినిమాకి సెన్సార్ వారు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. రన్ టైం 150 నిమిషాలు అంటే 2 గంటల 30 నిమిషాలు అని సమాచారం.

ఆఖరికి సెన్సార్ పనులు కూడా పూర్తి అయిపోయాయి కానీ సినిమా మాత్రం విడుదల అవ్వట్లేదు అంటూ అభిమానులు నిరాశ చెందుతున్నారు దర్శక నిర్మాతలు ఇంకా సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటించాల్సి ఉంది. మరోవైపు సినిమా ఏప్రిల్ లో మాత్రమే విడుదల అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

admin1

admin1

Next Story